సినిమా తరాలు సినిమా రంగంలోకి వచ్చిన తరువాత స్రీన్ పేర్లతో పాపులర్ అవుతారు.  వారి అసలు పేర్లు చాలా మందికి తెలియదు.  చాలామంది స్టార్స్ పేర్లు మార్చుకున్నాకే ఫేమస్ అయ్యారు.  అందుకే అందరు ఇలా దీనిని ఫాలో అవుతుంటారు.  ఇందులో భాగంగానే ఇలా పేర్లు మార్చుకుంటూ ఉంటారు.  ఇలా మార్చుకునే పేర్లను వారి భవిష్యత్తు ఉంటుందని అంటుంటారు. ఇలా ఎంతోమంది భవిష్యత్తు ఇలానే విజయం సాధించింది.  ఈ విధంగానే వృద్ధి చెందారు.  


పేర్లు మార్చుకున్నాకే వారికి విజయం లభించింది.  ఇకపోతే, జీవితంలో ఎదగాలి అంటే కష్టపడాలి.  కేవలం ఒక్క పేరు మార్చుకుంటేనో లేదంటే మరొకటి చేస్తేనో కుదరదు కదా.  ఇక అసలు విషయాల్లోకి వస్తే... సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం నయనతార.  నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. చంద్రముఖి సినిమాతో ఫేమస్ అయ్యింది.  ఆ టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.  అటు కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  శ్రీరామరాజ్యం సినిమా తరువాత సినిమాలకు స్వస్తిపలకాలని అనుకుంది.  కానీ, ప్రభుదేవాతో లవ్ అఫైర్ బ్రేక్ కావడంతో తిరిగి సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నది.  


ఇక టాలీవుడ్ లో సూపర్ సినిమాతో సూపర్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఇండస్ట్రీలో టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నది.  అరుంధతి సినిమాతో తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకుంది.  బాహుబలి, భాగమతి సినిమాలతో ఆమె తిరుగులేని నటిగా పేరు తెచ్చుకుంది.  టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా ఎదుగుతున్న అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి.  ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత అనుష్క శెట్టిగా మార్చుకుంది.

 
ఇండస్ట్రీలో రోజా గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఓన్ టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదిగింది.  చిన్న హీరోయిన్ గా ఎదిగిన ఈ నటి ఆ తరువాత టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యింది.  ఇప్పుడు నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించింది.  రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నది.  జబర్దస్త్ వంటి షోలలో మెప్పిస్తోంది.  రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి.  


ఫగ్లీ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ఎంఎస్ ధోని సినిమాతో మంచిపేరు తెచ్చుకుంది.  తెలుగులో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో హిట్ కొట్టింది.  అయితే, వినయ విధేయ రామ సినిమాతో బోల్తా కొట్టిన ఈ స్టార్, బాలీవుడ్ లో చేసిన కబీర్ సింగ్ సినిమా బెస్ట్ హిట్ అయ్యింది.  కియారా అసలు పేరు అలియా అద్వానీ.  అయితే, అలియా పేరు ఇండస్ట్రీలో ఉండటంతో ఆమె కియారా అద్వానీగా మార్చుకుంది.  


తెలుగులో తన అందంతో అభినయంతో ఎంతగానో పేరు తెచ్చుకొని మహిళా లోకాన్ని ఆకట్టుకున్న హీరోయిన్ సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యన్నారాయణ.  అతిలోక సుందరిగా చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్ప.  ఇకపోతే, నదియా అసలు పేరు జరీనా మొయిదు కాగా, సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.  నందిత అరవింద్ మోయాజీ నగ్మా పేరుతొ ఫేమస్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: