శ్రీదేవి నిజంగానే అతిలోక సుందరి.  చిన్నప్పటి నుంచి సినిమాలకే అంకితం అయ్యింది.  సినిమానే లోకంగా బతికింది.  ఆమె సినిమా చేసింది అంటే ఆ సినిమా మినిమమ్ హిట్ గ్యారెంటీ అనే విధంగా ఉండేది.  ఎన్టీఆర్ దగ్గరి నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అందరితో కలిసి నటించింది.  దేశంలోని దాదాపుగా ఎన్నో భాషల్లో హీరోయిన్ గానటించిన శ్రీదేవి బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే.  


అయితే, దుబాయ్ లో వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవి తన హోటలోని బాత్ టబ్ లో పడిమరణించింది.  దీంతో యావత్ ఇండియన్ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది.  దిగ్బ్రాంతి చెందటమే కాదు, ఎలా మరణించింది అనే విషయం అప్పట్లో ట్రెండ్ అయ్యింది.  బాత్ టబ్ లో పడితే ఎందుకు చనిపోతారు అనే విషయంపై కూడా అనేకమంది ఆరా తీశారు. అయితే, చివరకు ఆమె మరణం గుట్టు బయటపడింది.  


శ్రీదేవికి లో బిపి ఉందని,  చాలాసార్లు ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందని అంటున్నారు.  చాల్ బాజ్ సినిమా చేసే సమయంలో కూడా శ్రీదేవి ఇలానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు చెప్తున్నారు.  అదే విధంగా నాగార్జునతో సినిమా చేసే సమయంలో కూడా శ్రీదేవి ఇలానే ఓ సారి బాత్ రూమ్ టబ్ లో కళ్ళు తిరిగి పడిపోయినట్టు గుర్తు చేశారు.  ఇదే విషయాన్ని శ్రీదేవి కజిన్ మహేశ్వరి, అలానే భర్త బోనికపూర్ కూడా గుర్తు చేశారు.   లోబిపి వలన ఇలానే కళ్ళు తిరిగి పడిపోతుంటారు.  


దీనిపై అనేకమంది డాక్టర్లకు చూపించినా లాభం లేకపోయింది.  వైద్యులను సంప్రదిస్తే... దానిని మెడిసిన్ లేదని చెప్పినట్టు బోనికపూర్ తెలిపారు.  శ్రీదేవి లేని లోటును ఎవరూ పూర్తి చేయలేరు.  అందులో సందేహం అవసరం లేదు.  శ్రీదేవి బయోపిక్ కు సంబంధించిన పుస్తకం సత్యార్థి నాయక్ పేర్కొన్నారు.  కోలీవుడ్ లో చిన్నప్పుడే సినిమాల్లో నటించిన పెద్దయ్యాక దేశంలోని అన్ని సినిమాల్లో నటించింది.   ఎన్టీఆర్ తో మానవరాలిగా నటించిన ఈ హీరోయిన్ పెద్దయ్యాక కూడా ఎన్టీఆర్ తో కూడా నటించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: