అక్షరాలను మాటలుగా మార్చి ఆ మాటలను చాల పొదుపుగా వాడే త్రివిక్రమ్ సినిమాల పై పెట్టె ఖర్చు విషయంలో మాత్రం ఏమాత్రం పొదుపు పాటించడు. అంతేకాదు వ్యక్తిగత జీవితంలో కూడ పెద్దగా పొదుపు అంటే ఇష్టపడని త్రివిక్రమ్  ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోల ఇగో పై షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ప్రస్థుత తరం హీరోలు చాల వాస్తవ దృష్టితో ఉంటున్నారని సినిమా కంటే తాము పెద్ద వాళ్ళం అని అనుకోవడం లేదనీ అంటూ కామెంట్స్ చేసారు. గతంలో ఎన్టీఆర్ ఎఎన్ఆర్ సమయంలో హీరోలను బట్టి ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చేవారనీ ఇప్పుడు కథ బాగుండకపోతే ఎంత టాప్ హీరో సినిమా అయినా వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసాడు. 

ప్రస్తుతం చాల కుటుంబాలలోని బంధాలు బంధుత్వాలు గురించి మాట్లాడుతూ ‘ఎవరికైనా స్థానం ఇవ్వగలం కాని స్థాయిని ఇవ్వలేము’ అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు అని అభిప్రాయ పడ్డాడు. ధనవంతులు ఇళ్ళు చాల విశాలంగా ఉన్నా అక్కడ కాసేపు కూర్చోగానే బోరు కొట్టేస్తుందనీ చెపుతూ సంపద వేరు ఐశ్వర్యం వేరు నేటితరానికి తెలియటానికి ‘అల వైకుంఠపురములో’ కథను ఎంచుకున్న విషయాన్ని వివరించాడు. 

ఇదే సందర్భంలో ప్రస్తుత తరం గురించి మాట్లాడుతూ నేటి తరం మళ్ళీ నెమ్మదిగా పుస్తకాల విలువ తెలుసుకుంటోంది అన్న అభిప్రాయం తనకు ఈమధ్య జరిగిన పుస్తక ప్రదర్శన చూస్తే కలిగింది అని అంటూ యువతలో వస్తున్న మార్పును విశ్లేషించాడు. క్యూ లైన్ లో నుంచుని పుస్తకాలు కొనుక్కున్న కొందరు యూత్ ను తనకు చూస్తే నేటితరం మారుతోంది అన్న అభిప్రాయం కలిగింది అని కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో విలువలు గురించి మాట్లాడుతూ ఇప్పటి తప్పు రేపు ఒప్పుగా మారిపోతోందనీ ఇప్పటి ఒప్పు  రేపటి తప్పుగా మారిపోతున్న పరిస్థితులలో ప్రజల అభిప్రాయాలు క్షణక్షణం మారిపోతున్న విషయాలను వివరిస్తూ ఈనాటి తరంతో మారగలిగిన వ్యక్తి మాత్రమే రేపటి రోజున మిగులుతాడు అంటూ త్రివిక్రమ్ సంక్రాంతి సినిమాలను పందెం కోళ్లుగా పోల్చవద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: