రజినీకాంత్ దర్బార్ మూవీ జనవరి 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్ నడుస్తోంది.  లండన్ లో ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి.  ఈ సినిమాకు 12 ఏ రేటింగ్ ఇచ్చారు.  12 ఏ రేటింగ్ అంటే మంచి రేటింగ్ అనే చెప్పాలి.  ఈ సినిమా కోసం లైకా చాలా ఖర్చు చేసింది.  మురుగదాస్ తో సినిమా చేయాలని రజినీకాంత్ గత 15 ఏళ్లుగా అనుకుంటున్నా కుదరడం లేదు.  ఇన్నాళ్ల తరువాత ఆ కాంబినేషన్ సెట్ అయ్యింది. 


రజినీకాంత్ సినిమా గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరిగా సందడి చేయలేకపోతుండటంతో ఫ్యాన్స్ ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సినిమాతో ఎలాగైనా జబర్దస్త్ హిట్ కొట్టాలని రజినీకాంత్ చూస్తున్నారు.  దానికి తగ్గట్టూనే రజిని ఈ సినిమా కోసం కష్టపడిన సంగతి తెలిసిందే.  తలైవర్ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది అంటే అవతల ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే ఢమాల్ అనాల్సిందే.  


ఇకపోతే ఈ సినిమాలో దిశ ఘటన ఆధారంగా ఓ సీన్ ను రాసుకున్నారట మురుగదాస్.  ఆ సీన్ ఇందులో కీలకం కానున్నది.  దాని ప్రకారమే సినిమా ఉండబోతున్నది.  ఇందులో రజినీకాంత్ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దాదాపుగా 25 ఏళ్ల తరువాత పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు కాబట్టి సినిమాపై అంచానాలు ఉన్నాయి.  ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా చేయడం వెనుక కూడా ఇదే కారణం అంటున్నారు.  


ఎప్పుడు ప్రీ రిలీజ్ వేడుకను లో ప్రొఫైల్ గా నిర్వహించేవారు.  కానీ, ఈసారి హైదరాబాద్ లో ఈ సినిమాను భారీ ఎత్తున నిర్వహించారు.  అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు.  ఈ మూవీ హిట్టయితే.. నెక్స్ట్ చేస్తున్న సినిమాకు అంచనాలు వెల్లువెత్తుతాయి.  తెలుగులో సినిమా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.  తప్పకుండా సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.  మరి ఈ సినిమా ఈమేరకు మెప్పిస్తుందో తెలియాలంటే జనవరి 9 వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: