అప్పటి కాలంలో మనుషులు మధ్య ప్రేమలు ఎలా ఉంటాయంటే ఒక పూట అన్నం లేకపోయినా కూడా పర్వాలేదు... కానీ పక్కంటి వాళ్ళతో మాట్లాడకుండా చాలా ఉందరనుకొండి.. ఇకపోతే ఈ మధ్య పెళ్లిళ్లు ఎలా ఉన్నాయో చెప్పాలంటే మాటలు చాలవు..అది కూడా భారతీయ పెళ్లిళ్లు అంటే ఆ సంప్రదాయాలు అన్నీ వేరే అని చెప్పాలి.. సినిమాలలో చెప్పినట్లే ఇప్పుడు జీవితాలు  కూడా ఉన్నాయి..

 

పెళ్లి అంటే ఇటు ఏడూ తరాలు అటు ఏడూ తరాలు చూసి పెళ్లి చేసుకుంటారు.. అందుకే పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో నిర్ణయింపడతాయని అంటారు.. ఒక నెల నుండి హడావిడి మామూలుగా ఉండదు.. ఆకాశమంత. పందిరి వేసి భూదేవి అంత ఆరిటాకు వేసి వచ్చిన బందువులు పదిరోజుల వరకు మర్చిపోకుండా చేస్తుంది.. అందుకే పెళ్లి అనే మాట జీవితంలో ఒక్కసారే జరుగుతుంది.. ఈ మధ్య ఈ పెళ్లి తంతు ఆచారాలు కూడా పూర్తిగా మారిపోయింది.. కాలం మారినా కొద్ది ఆచారాలు కూడా కనుమరుగయ్యాయి .

 

ఒకప్పుడు ఎంత బిజీగా ఉన్నా వచ్చి నాలుగు అక్షంతలు వేసి ఆశీర్వదించే వారు ఇప్పుడు అది పూర్తిగా వ్యతిరేకమని చెప్పాలి.. పెళ్లి అని పనికట్టుకుని ఎక్కడో ఉన్నా వాళ్లకు చెప్పి వెళితే కానిసం రావడం మాట పక్కన పెడితే ఫోన్లో అస్వీర్వదం అక్షంతలు కూడా అయిపోతున్నాయి అంటే నమ్మండి.. భారత దేశం అభివృద్ధి చెందిందని  సంతోష పడాలా లేకా ఆచారాలు మంట కలిసాయని భాదపడాలో అర్థం కావడం లేదు..

 

ఇప్పటి కాలంలో ఆడవాల్లు అనే వారు భర్తను ఎప్పుడూ సాధించడం అనే మాట వినపడుతుంది.. ఉద్యోగం చేసి వచ్చాడు ..పాపం కష్టపడుతున్నారు.. అని ఇంటికి రాగానే కాఫీ తాగుతారు..అని అడగల్సిందించి పోయి ఎక్కడున్నావ్.. ఎప్పుడు వస్తారు.. ఇవే తప్ప అలా చేస్తే ఇలా వస్తుంది.. లేదా ఇది చేద్దాం అంటూ మంచి చెప్పడం మానేసి ...ఏదేదో మాట్లాడుతున్నారు.. సాధించడమే తప్ప సలహాలు చెప్పేవారు లేరనే చెప్పాలి..ఇదండీ ఇప్పటి ఆడవాళ్ళకు అప్పటి వల్లకు భేదాలున్నయనే సంగతి వేరేలా చెప్పనక్కర్లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: