చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో సినీ ఫీల్డ్ నుంచి హీరో రాజశేఖర్ రూపంలో తొలి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య వైరం కొనసాగిందనే విషయం తెలిసిందే. కానీ.. దాదాపు మూడేళ్ల క్రితం నుంచి వీరిద్దరూ స్నేహంగానే మెలుగుతున్నారు. మళ్లీ వీరిద్దరి మధ్య సఖ్యత చెడిందా అనే అనుమానాలు వస్తున్నాయి. కారణం.. ఇటివల జరిగిన మా సమావేశం.

 

 

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మా అసోసియేషన్ ఓ దేవాలయం. దానికి మెగాస్టార్ చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇటివలి సమావేశంలో చిరంజీవి సమక్షంలోనే మీడియా ఉండగా రాజశేఖర్ ప్రవర్తించిన తీరు ఆయనకు అసహనం తెప్పించింది. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించిందని భావించిన వేళ ఈ సంఘటన మళ్లీ అనుమానాలు లేవనెత్తుతోంది. సమావేశం తర్వాత రాజశేఖర్ మామధ్య విబేధాలు లేవని వెల్లడించినా అది మొక్కుబడిగానే అనేది అర్ధమవుతోంది. 2009లో భీమవరంలో రాజశేఖర్ కుటంబంపై జరిగిన దాడి అప్పట్లో తీవ్ర సంచలనమైంది. ఆ ఎన్నికల్లో చిరంజీవికి వ్యతిరేకంగానే రాజశేఖర్ దంపతులు పని చేశారు. దాదాపు మూడేళ్ల క్రితం రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా ప్రమోషన్ ను వారు చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ ప్రారంభించారు.

 

 

రాజశేఖర్ తన కుమార్తె డాక్టర్ సీట్ కోసం చిరంజీవి సాయం కోరినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య వైరం పోయి తిరిగి స్నేహం చిగురించిందని అర్ధమైంది. గతేడాది ‘సైరా’ విజయోత్సవాన్ని టి.సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో కూడా చిరంజీవి నటనను రాజశేఖర్ పొగిడేశాడు. మా అసోసియేషన్ లో రాజశేఖర్ ప్యానల్ నెగ్గడానికి కూడా చిరంజీవి కారణమయ్యాడు. ఇంతటి సహృద్భావ వాతావరణం ఏర్పడిన ఈ సందర్భంలో మళ్లీ ఈ సంఘటనతో వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోయినా గతంలోలా విబేధాలు రాకుండా ఉంటే మంచిది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: