కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో తొలి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత విజయ్ దేవరకొండ నటించిన ద్వారక సినిమా ఫ్లాప్ అయినా అర్జున్ రెడ్డి సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత విజయ్ నటించిన మహానటి, గీతా గోవిందం సినిమాలు కూడా హిట్టయ్యాయి. టాక్సీవాలాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ నటించిన గత చిత్రం డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయింది. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఒక రైటర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. రైటర్ పాత్రలో విజయ్ ఒక కథ రాయడం మొదలుపెడతాయని అలా సినిమాలో మొదటి హీరోయిన్ పాత్ర ఎంటర్ అవుతుందని తరువాత ఆ కథ నచ్చక చెరిపివేసి మరో కొత్త కథ రాస్తాడని అలా మరో హీరోయిన్ ఎంటర్ అవుతుందని ఇలా మొత్తం నలుగురు హీరోయిన్లు హీరో రాసిన కథలలో ఉంటారని సమాచారం. 
 
ప్రతి కథలో హీరోయిన్ మారినా హీరో పాత్రలో విజయ్ తనను తాను హీరోగా ఊహించుకుంటాడని సమాచారం. సోషల్ మీడియాలో ఈ సినిమా కథ ఇదే అంటూ వైరల్ అవుతోంది. ఒక ఫ్రెంచ్ సినిమాకు ఫ్రీమేక్ గా వరల్డ్ ఫేమస్ లవర్ తెరకెక్కిందని సమాచారం. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే చిత్రయూనిట్ స్పందిస్తే తప్ప స్పష్టత రాదు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నట్టు సమాచారం. 
 
కెరీర్ లో డిజాస్టర్ వచ్చిన ప్రతిసారి మరో హిట్ తో ఫామ్ లోకి వచ్చాడు విజయ్ దేవరకొండ. మరి ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ఈ సినిమాకు కే ఎస్ రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: