తెలుగు సినిమాలకు సంక్రాంతి ముఖ్యమైన పండుగ. ఏడాది ప్రారంభంలో వచ్చు ఈ అతి పెద్ద పండుగకు సినిమాలు విడుదల చేయాలని దాదాపు ఎనిమిది నెలల ముందు నుంచు ప్రయత్నాలు జరిగిపోతూంటాయి. ఎన్ని సినిమాల బరువు వచ్చినా మోయగల పండుగగా సంక్రాంతికి పేరు. ఇది తెలుగు సినిమాకు ఓ సెంటిమెంట్ అని చెప్పాలి. అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురంలో కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు బన్నీకి ఓ మంచి సెంటిమెంట్ తోడయిందనే చెప్పాలి.

 

 

సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే జనవరి 12న బన్నీపూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన దేశముదురు సినిమా విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పూరి మంచి స్వింగ్ లో ఉన్న సమయం అది. అంతకుముందు ఏడాదే మహేశ్ తో పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఉన్నాడు. ఆ ఊపులో చేసిన సినిమా దేశముదురు. ఈ సినిమాతో పూరి బన్నీ బాడీ లాంగ్వేజ్ ను మార్చేశాడు. అప్పటివరకూ కొన్ని మాస్ సినిమాలు చేసినా పూరి మార్క్ మాస్ క్యారెక్టర్ చేయడంతో బన్నీ రేంజ్ పెరిగిపోయింది. ఆ సినిమాతోనే బన్నీ టాలీవుడ్ లో తొలిసారి సిక్స్ ప్యాక్ చేసిన హీరోగా నిలిచాడు.

 

 

అలాంటి లక్కీ డేట్ నే బన్నీ 13 ఏళ్ల తర్వాత మళ్లీ తన సినిమా అల.. వైకుంఠపురంలో సినిమాకు లాక్ చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో అల.. పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అప్పట్లో పూరితో సంక్రాంతికి వస్తే ఇప్పుడు త్రివిక్రమ్ తో వస్తున్నాడు. మరి ఆ స్థాయి అంచనాలను బన్నీ అందుకుంటాడో లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: