ముందునుండి అనుకున్నట్లుగానే 96 తెలుగు రీమేక్ కు జాను అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కొద్దీ సేపటి క్రితం టైటిల్ తో కూడిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదలచేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో ఏడారి లో ఒంటెల తో కనిపించాడు శర్వానంద్. ఈచిత్రంలో ఆయన వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా నటిస్తున్నాడు.
కోలీవుడ్ లో విజయ్ సేతుపతి ,త్రిష జంటగా ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం '96' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఒరిజినల్ వెర్షన్ ను
డైరెక్టర్ చేసిన ప్రేమ్ కుమారే ఈ
రీమేక్ కు దర్శకుడు కాగా గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. వీరిద్దరికి తెలుగులో ఇదే మొదటి చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై
దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం
ఫిబ్రవరి లో విడుదలకానుంది.
ఇక ఇటీవల వరస పరాజయాలతో సతమతమవుతున్న శర్వానంద్ ఈ రీమేక్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలావుంటే శర్వా ప్రస్తుతం నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు.
రైతుల సమస్యల నేపథ్యం లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై
రామ్ ఆచంట , గోపించంద్ ఆచంట నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక
సమంత మాత్రం
96 రీమేక్ తరువాత ఇంతవరకు మరో సినిమాను సైన్ చేయలేదు. ప్రస్తుతం ఆమె సూపర్ హిట్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటిస్తుంది.