‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ పై నందమూరి ఫ్యామిలీ ఎంత రగిలిపోయింది అన్నది తెలిసిన విషయమే. ఆ సినిమా విడుదల కాకుండా చేయాలని నందమూరి కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేసారు అన్న వార్తలు ఉన్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ పట్టుదల ముందు నందమూరి కుటుంబ సభ్యుల వ్యూహాలు ఫలించక పోవడంతో నందమూరి ఫ్యామిలీకి ఆ మూవీ ఎంతవరకు చేయాలో అంత వరకు చేసింది. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన విజయ్ కుమార్ మంచి రంగస్థల నటుడు. కొన్ని వందల నాటకాలు అతడికి వేసిన అనుభవం ఉండటంతో ఎన్టీఆర్ లా కనిపించడమే కాకుండా ఎన్టీఆర్ హావభావాలను సజీవంగా చూపించగలిగాడు. ఈ మూవీ తరువాత మళ్ళీ విజయ్ కుమార్ కు ఎటువంటి అవకాశాలు రాలేదు. 

మధ్య తరగతి కుటుంబానికి చెందిన విజయ్ కుమార్ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. ఇలాంటి పరిస్థితులలో ఆయనకు ఒక ఊహించని కష్టం వచ్చిపడింది. ఆయన భార్యకు క్యాన్సర్ రావడంతో హైదరాబాద్ తీసుకు వచ్చి బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ లో ఎడ్మిట్ చేసి ఆమెకు వైద్యం విజయ్ కుమార్ చేయిస్తున్నాడు. అయితే హాస్పటల్ లోని కొందరు డాక్టర్లు యాక్టర్ విజయ్ కుమార్ ను గుర్తించడంతో ఆ విషయాలు బాలకృష్ణ వరకు వెళ్ళినట్లు టాక్. 

ఈ విషయాలను తెలుసుకున్న వెంటనే బాలయ్య బసవతారకం హాస్పటల్ చీఫ్ డాక్టర్ కు ఫోన్ చేసి విజయ్ కుమార్ భార్యకు మంచి మెరుగైన వైద్యాన్ని ఒక్క రూపాయి తీసుకోకుండా అందించమని చెప్పాడట. ఈ విషయం డాక్టర్స్ ద్వారా తెలుసుకున్న విజయ్ కుమార్ బాలయ్య ఉదారతకు షాక్ అయి బాలయ్యను వ్యక్తిగతంగా కలిసి తన కృతజ్ఞతలు తెలియ చేసుకున్నప్పుడు బాలయ్య అతడిని అభిమానంగా పలకరించడమే కాకుండా అతడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో నటించినందుకు తనకు ఏమాత్రం కోపం లేదనీ సినిమాలు వేరు జీవితం వేరు అంటూ బాలయ్య అతడికి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: