వెండితెరపై విజయశాంతి .. బాలకృష్ణ జోడి సూపర్ హిట్ జోడిగా నిలిచింది.  ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేశారు.  నూటికి 99 శాతం హిట్ అయ్యాయి.  ఈ సినిమాలు హిట్ కావడంతో ప్రతి ఒక్కరి కృషి ఉన్నది.  ఈ సినిమాలు హిట్ ఎందుకు అయ్యాయి అనే విషయం పక్కన, పెడితే వీరిద్దరూ కలిసి మొత్తం 17 సినిమాలు చేశారు.  ఈ 17 సినిమాల్లో 2 సినిమాలు మినహా మిగతా మొత్తం కూడా హిట్ సినిమాలుగా నిలిచాయి.  మరి ఆ సినిమాలు ఏంటో చూద్దామా.  


కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ - విజయశాంతిలు కలిసి మొదటిసారి కథానాయకుడు సినిమాలో నటించారు.  ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం నమోదు చేసుకుంది.  ఇద్దరి జోడి మొదటి సినిమాతోనే హిట్ కావడంతో అక్కడి నుంచి విజయాల పరంపర మొదలైంది.  ఈ సినిమా తరువాత ఇద్దరు కలిసి బాలకృష్ణ సొంత బ్యానర్ రామకృష్ణ స్టూడియోస్ పతాకంపై పట్టాభిషేఖం సినిమా చేశారు.  ఇది కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  


రెండో సినిమా కూడా హిట్ కావడంతో హిట్ పెయిర్ గా టాలీవుడ్ లో పేరు వచ్చింది.  ఆ తరువాత భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన‘ముద్దుల కృష్ణయ్య’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మూడో సినిమా కూడా సక్సెస్ కావడంతో సూపర్ సక్సెస్ జోడిగా పేరు తెచ్చుకున్నారు.  అనంతరం దేశోద్ధారకుడు సినిమా యావరేజ్ గా నిలిస్తే, కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన అపూర్వ సహోదరులు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.  


ఆ తరువాత భార్గవ రాముడు సినిమాతో ఈ పెయిర్ మరో హిట్ కొట్టింది.  అయితే, దీని తరువాత వచ్చిన సాహస సామ్రాట్ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.  ఈ సినిమా ఫెయిల్ కావడంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ పెయిర్ మువ్వగోపాలుడు సినిమా చేశారు. ఈ మూవీ భారీ హిట్ సొంతం చేసుకుంది.  ఆ తరువాత భానుమతిగారి మొగుడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, భలేదొంగ సినిమాలు హిట్ అందుకున్నాయి.  ఆ తరువాత చేసిన ముద్దుల మామయ్యా, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.  ఆ తరువాత చేసిన తల్లిదండ్రులు సినిమా హిట్ కాగా, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా భారీ హిట్ అయ్యింది. ఈ ఇద్దరు కలిసి చివరిగా నిప్పురవ్వ సినిమా చేశారు.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: