శర్వానంద్ , సమంత జంటగా నటించిన చిత్రం జాను. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర బృందం. అందులో భాగంగా  నిన్న ఈ సినిమా  టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా  రేపు ఈ సినిమా టీజర్ ను  సాయంత్రం 5గంటలకు  విడుదలచేయనున్నారు. టీజర్ లో సమంత ,శర్వా , మ్యూజిక్ హైలైట్ అయ్యాయని సమాచారం.  
 
ఈచిత్రంలో శర్వానంద్ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా కనిపించనున్నాడు. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి ,త్రిష జంటగా  ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం  '96' కు రీమేక్ గా తెరకెక్కుతుండడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు వున్నాయి.  ఒరిజినల్ వెర్షన్ ను  డైరెక్టర్ చేసిన ప్రేమ్  కుమారే ఈ రీమేక్ కు దర్శకుడు కాగా  గోవింద్ వసంత  సంగీతం అందిస్తున్నాడు. వీరిద్దరికి తెలుగులో ఇదే మొదటి చిత్రం.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ పై  దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం ఫిబ్రవరి 7న విడుదలకానుంది. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
ఇక ఈ చిత్రం  తరువాత  శర్వా  ప్రస్తుతం  శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ రెడ్డి  డైరెక్షన్ లో  తెరకెక్కుతున్న  ఈ చిత్రాన్ని 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపించంద్ ఆచంట నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.  ఇక సమంత మాత్రం 96 రీమేక్ తరువాత ఇంతవరకు మరో సినిమాను  సైన్ చేయలేదు. ప్రస్తుతం  ఆమె  సూపర్ హిట్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో  నటిస్తుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: