తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు.  మెగాస్టార్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.  మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ ఏడేళ్లు ఉంది తిరిగి ఖైదీ నెంబర్ 150 ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.  ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ ఆ సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  


కాగా, మెగాస్టార్ తన 151 వ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో సైరా సినిమాగా తెరకెక్కింది.  ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  మెగాస్టార్ సినిమా అంటే హైదరాబాద్ లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.  సైరా సినిమా హైదరాబాద్ లో 749 షోలు వేశారు.  ఇది మెగాస్టార్ కెరీర్లో ఓ రికార్డ్.  ఈ రికార్డ్ ఇప్పటి వరకు పదిలంగా ఉన్నది.  


కాగా, ఇప్పుడు ఈ రికార్డును సూపర్ స్టార్ రజినీకాంత్ బీట్ చేశాడు.  ఈ సినిమా 771 షోలు వేసుకోబోతున్నది.  ఈ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు షోలు వేయబోతున్నారు.  దర్బార్ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాను ఈ స్థాయిలో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది.  అన్ని థియేటర్స్ లో సినిమా టికెట్స్ ఇప్పటికే బుక్కయ్యాయి.  ఫస్ట్ డే మాత్రమే ఈ రికార్డ్ ఉంటుందో లేదంటే రెండో రోజుకూడా ఈ రికార్డును సృష్టిస్తుందో చూడాలి.  

 

 
అటు తమిళనాడులో మానియా మొదలైంది. ఎక్కడ చూసినా తలైవర్ అనే పేరు... రజిని పోస్టర్లు వెలుస్తున్నాయి.  ఇప్పటికే కొన్ని సంస్థలు రజినీకాంత్ సినిమా కోసం లీవ్ లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.  మొదటి రోజున కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో మరికొంది గంటల్లోనే తేలిపోతుంది.  సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే  కలెక్షన్ల సునామీనే అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: