మొన్న జనవరి 6అలవైకుంఠపురములో సినిమా మ్యూజికల్ నైట్ జరిగిన సంగతి తెలిసిందే. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రంలో అపశ్రుతులూ చోటు చేసుకున్నాయి. 'అల వైంకుఠపురములో చిత్ర వేడుక సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు వివరాలు తెలిపారు.

 

పరిమితికి మించి అభిమానులను అనుమతించడం, నిబంధనలు అతిక్రమించి నిర్ణీత సమయం కంటే ఎక్కువ టైమ్ తీసుకోవడం, ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం, లాఠీ చార్జ్ చేయాల్సి రావడం వంటి కారణాలతో వీరిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ నెల 6నయూసుఫ్ గూడ లోని పోలీస్ బెటాలియన్ గ్రౌండ్లో అల వైంకుఠ పురములో చిత్ర మ్యూజికల్ నైట్ వేడుకలకు సంబంధించి ఈ నెల 2హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ కె.యగ్నేశ్ పోలీసుల అనుమతి తీసుకున్నారు.

 

సుమారు 5 నుంచి 6 వేల మంది వచ్చే అవకాశం ఉందని, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి కావాలని దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే కార్యక్రమం రాత్రి 11.30 గంటల వరకు కొనసాగింది. 5 వేల పాసుల స్థానంలో నిర్వాహకులు 15 వేలపాసులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వేదిక వద్ద తొక్కిసలాట జరగడంతో పాటు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.

 

వీటి వీడియో ఫుటేజీలను పోలీసులు సేకరించారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య సైతం ఏర్పడింది. దీనిపై జూబ్లీహిల్స్ ఎస్సై ఫిర్యాదు మేరకు శ్రేయాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 336, 341, 143 కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. మరి ఈ విషయంపై అల వైకుంఠపురములో యూనిట్ ఎలా స్పందిస్తుందో.. ఏమని వివరణ ఇస్తుందో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: