ఇప్పుడు ఎక్కడ చూసినా దర్బార్ దర్బార్... రజినీకాంత్ రజినీకాంత్... ఇదే మానియా ఇప్పడు దేశాన్ని ఊపేస్తున్నది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ పక్కా స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో రజిని కాంత్ అదరగొట్టాడు. మురుగదాస్ సినిమాను పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరక్కించారు. సర్కార్ సినిమా మాస్ సినిమా అయినప్పటికీ, ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ వేరు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంది. ఈ 14 కోట్లు ఈ ఒక్కరోజులోనే వచ్చేలా కనిపిస్తున్నాయి. నగరాల్లో, పట్టణాల్లోనే కాదు, చిన్న చిన్న మండలాల్లో కూడా రజినీకాంత్ కు అభిమానులు ఉన్నారు.
ఈ సినిమా విజయాన్ని వాళ్ళు కూడా సందడిగా చేసుకుంటున్నారు. సినిమా సినిమా మాస్ హిట్టయితే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపించారు. సినిమాకు స్క్రీన్ ప్లే ఎంతటి బలాన్ని ఇచ్చిందో రజిని నట విశ్వరూపం అంతటి బలాన్ని ఇచ్చింది. రజిని సినిమా కోసం ఎంతగానైనా కష్టపడగలడు అని ప్రపంచానికి మరోసారి చూపించింది. సినిమా మొత్తం రజినీని కనిపిస్తాడు.
రజినీకాంత్ వన్ మ్యాన్ ఆర్మీగా సినిమాను నడిపించాడు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. మర్డర్ కేసును పరిష్కరించే సమయంలో ఎదురైనా సవాళ్ళను పోలీసులు ఎలా ఎదుర్కొన్నారు, బ్యాడ్ బ్యాచ్ కు రజిని ఎలా బుద్ధి చెప్పారు అన్నది సినిమాలో అద్భుతంగా చూపించినట్టు తెలుస్తోంది. సినిమా పరంగా ఎన్నో అద్భుతాలను చేసి చూపించారు సూపర్ స్టార్. లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాకు మరో ప్లస్ గా నిలిచింది.
ఇందులో నివేతా థామస్ రజిని కూతురిగా కనిపించింది. పెద్ద అమ్మాయికి తండ్రిగా ఉన్నప్పటికీ అయన ఎలా అంత ఫైట్ చేయగలిగాడు సినిమాలో మ్యాజిక్ చేసి చూపించారు. రజిని సినిమా విజయం సాధిస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా అంటున్నారు ప్రేక్షకులు. కేవలం ఇక్కడ ఒక్కచోటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే టాక్. సినిమాను చూసిన ప్రతి ఒక్కరి భావన ఇలానే ఉంటున్నది.