సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా ఎ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ సినిమా ఈరోజు విడుదలైంది. మురుగదాస్ లాంటి ప్రతిభావంతమైన దర్శకుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. తలైవా రజనీ ఫ్యాన్స్ దర్బార్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
సంక్రాంతి పండుగకు రజనీ - మురుగదాస్ విందు భోజనం లాంటి సినిమాను అందించారని ప్రేక్షకులు చెబుతున్నారు. రోబో తరువాత తొమ్మిదేళ్ల పాటు వరుస డిజాస్టర్లతో చతికిలపడిన రజనీకాంత్ దర్బార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని ప్రేక్షకులు చెబుతున్నారు. రజనీ వన్ మేన్ షో దర్బార్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
భారీ అంచనాల నడుమ విడుదలైన దర్బార్ సినిమాకు కేవలం రజనీకాంత్ మాత్రమే మెయిన్ హైలెట్ గా నిలిచారు. రజనీ మార్క్ ఎలివేషన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ మాత్రం అద్భుతంగా కుదిరాయి. రజనీ ఫ్యాన్స్ కు దర్బార్ సినిమా ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పవచ్చు. ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ దగ్గరినుండి చివరివరకు రేసీ స్క్రీన్ ప్లే తో దర్శకుడు అలరించాడు. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెనులతో రజనీకాంత్ ప్రేక్షకులను కట్టిపడేశాడు. 
 
ఏడు పదుల వయస్సులో కూడా రజనీకాంత్ స్క్రీన్ మీద ఎంత బాగున్నాడో అనేలా ఉన్నాడని మంచి సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమా అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రజనీ ఇమేజ్ కు తగిన కంటెంట్ తో ఎ.ఆర్ మురుగదాస్ దర్బార్ సినిమాను తెరకెక్కించాడని మొత్తం మీద ఈ సంక్రాంతికి తలైవా రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: