ఈరోజు విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ మ్యానియాతో తమిళ నాడులోని థియేటర్స్ అన్ని దద్దరిల్లి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనికితోడు ఈ సినిమా హిట్ టాక్ రావడంతో రజనీకాంత్ అభిమానుల ఉత్సాహానికి ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. ‘దర్బార్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేయడంతో నిన్న అర్ధరాత్రి నుండి చెన్నైలో ఈ సినిమా స్పెషల్ షోలు ప్ర్రారంభం అయ్యాయి. 

నిన్న అర్దరాత్రి చలిని కూడ లెక్క చేయకుండా రజినీకాంత్ అభిమానులు ఈ మూవీ విడుదలైన ధియేటర్స్ వద్ద బాణ సంచా పేలుస్తూ చేసిన హడావిడితో చెన్నై నగరం అర్దరాత్రి దద్దరిల్లి పోయినట్లు సమాచారం. ఈ సినిమాను నిన్న అర్థరాత్రి ప్రత్యేక షోలలో చూడటానికి ప్రత్యేకంగా జపాన్ నుండి రజినీకాంత్ అభిమానులు ఆ దేశం నుండి ప్రత్యేకంగా రావడమే కాకుండా రజినీకాంత్ అభిమానులతో కలిసి ధియేటర్స్ వద్ద చేసిన హడావిడి మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు ‘దర్బార్’ సూపర్ హిట్ కావాలని రజినీకాంత్ అభిమానుల కుటుంబాలకు సంబంధించిన స్త్రీలు నిన్న తమిళనాడు అంతా వివిధ ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు చేయడమే కాకుండా ఆ ప్రత్యేక పూజలలో వందలాది సంఖ్యలో మహిళలు పాల్గొనడం మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా రజినీ మ్యానియాను సూచిస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో వచ్చిన ఫస్ట్ హాఫ్ లోని యాక్షన్ సీన్స్ కామెడీ సీన్స్ కు రజినీకాంత్ అభిమానులు బాగా కనెక్ట్ అవుతున్నారు. 

ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే ఇంట్రవెల్ బ్యాంగ్ ట్విస్ట్ ఈ మూవీకి హైలెట్ గా మారిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కథ రొటీన్ కథ అయినప్పటికీ ఈ మూవీకి మురుగుదాస్అందించిన అద్భుతమైన స్క్రీన్ ప్లే ఈ మూవీని నిలబెడుతుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ నటన చూసి మాస్ ఆడియన్స్‌ ఫిదా అయిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: