సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవడం మామూలే. ఇప్పుడంటే పోటీతత్వం పెరిగిపోయింది కానీ.. గతంలో పండుగకు సినిమా వస్తుంది అన్నట్టు మాత్రమే ఉండేది. అలా సంక్రాంతికి గతంలో వచ్చిన చిరంజీవి సినిమాల్లో దొంగమొగుడు, స్టూవర్టుపురం పోలిస్ స్టేషన్ కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో 1988 జనవరి 9న దొంగమొగుడుకు 33ఏళ్లు, 1991 జనవరి 9న వచ్చిన స్టూవర్టుపురం పోలిస్ స్టేషన్ కు 29 ఏళ్లు పూర్తయ్యాయి.

 

 

చిరంజీవి సుప్రీం హీరోగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచి మాస్ హీరోగా ఉన్న రోజుల్లో వచ్చిన సినిమా దొంగమొగుడు. ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. చిరంజీవి చేసిన మాస్ కామెడీ ప్రేక్షకులను బాగా రంజింపజేసింది. సినిమాలో పాటలు సూపర్ హిట్. ‘నల్లంచు తెల్ల చీర..’ పాట అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. చిరంజీవి చేసిన మాస్ పాత్రల్లో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఊర మాస్, బిజినెస్ మేన్ పాత్రల్లో చిరంజీవి నటన అద్భుతమనే చెప్పాలి.

 

 

యండమూరి నవల ఆధారంగా తెరకెక్కిన స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా కధాబలం ఉన్న సినిమా. అయితే నవల ఎంత సూపర్ హిట్ అయిందో సినిమా అంత ఫ్లాప్ అయింది. అప్పట్లో యండమూరి నవలలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎన్నో యండమూరి కథలను హిట్ సినిమాలుగా మలచుకున్న చిరంజీవి స్టూవర్టుపురం.. చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. యండమూరే దర్శకత్వం వహించడం.. స్క్రీన్ ప్లే సరిగా కుదరకపోవడం సినిమాకు మైనస్ గా మారింది. కానీ కథా పరంగా, పాటలు సినిమాకు ప్లస్. ఈ సినిమాతోనే కేఎస్ రామారావు నిర్మాతగా, ఇళయరాజా సంగీత దర్శకుడిగా చిరంజీవితో ఆఖరుగా పని చేసిన సినిమాగా నిలిచిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: