మురుగదాస్ సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి పేరు ఉంటుంది.  అయన తీసే చిత్రాలు సామాజిక కోణంలో ఉంటాయి.  శంకర్ శిష్యుడు కాబట్టి అయన మాదిరిగానే సినిమాలు తీస్తుంటారు.  అయితే, మురుగదాస్ కోణం వేరుగా ఉంటుంది.  ఇక ఇదిలా ఉంటె, మురుగదాస్ గజని, రమణ, కత్తి, తుపాకీ, సర్కార్, సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే.  బలమైన కథను తీసుకొని దాని చుట్టూ బలమైన కథనాలు అల్లుకుంటారు.  


కానీ, మురుగదాస్సినిమా దగ్గరికి వచ్చే సరికి ఎందుకు మొత్తం మారిపోయింది.  పాత కథనే తీసుకున్నారు.  కాకపోతే, కొత్తదనం కోసం కొత్తగా స్క్రీన్ ప్లే అల్లుకున్నారు.  ఈ స్క్రీన్ ప్లే చేసిన మ్యాజిక్ సినిమాకు బాగా పనిచేసింది.  ఈ మ్యాజిక్ తో సినిమా ఎక్కడికో వెళ్ళింది.  సినిమాపై అంచనాలు పెరిగాయి.  అనుకున్నట్టుగానే మాస్ ను సినిమా జబర్దస్త్ గా ఆకట్టుకుంది. సినిమాలో ఎలాంటి హంగులు లేకున్నా అన్నింటికంటే రజిని మాస్ యాక్షన్ అదిరిపోయిందని అంటున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ఫ్యాన్స్ మాత్రమే కాదు మామూలు జనాలు కూడా సినిమా బాగాలేదని ఎవరూ చెప్పడం లేదు.  సినిమా చాలా బాగుంది అంటున్నారు.  అయితే, సినిమా కథ పరంగా తీసుకుంటే మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు అని అంటున్నారు.  కథను మరో రకంగా తీసుకొని ఉంటె సినిమా మరోలా ఉండేది అని అంటున్నారు.  కానీ, మురుగదాస్ ఇలాంటి కథను ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదు.  


పాత చెత్తలో ఉన్న కథను దులిపి కొత్తగా స్క్రీన్ ప్లే ను రాసుకున్నట్టుగా ఉన్నది సినిమా.  మొత్తానికైతే సినిమా విషయంలో రజినీకాంత్ మంచి నిర్ణయం తీసుకున్నారు.  మురుగదాస్ తో సినిమా చేయడం కలిసి వచ్చింది.  70 ఏళ్ల వ్యక్తి అంతకంటే ఇంకా యాక్షన్ డ్యాన్స్ చేయాలి అంటే కష్టం కదా.  ఈ సినిమాలో అన్ని రకాల అంశాలు వర్కౌట్ అయ్యాయి.  కాకపోతే వచ్చిన చిక్కల్లా మురుగదాస్ పాత కథను ఎంచుకోవడమే ఇదొక్కటే వెలితి.  మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది కాబట్టి సరిపోయింది.  లేదంటే ఇబ్బందే కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: