ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జునకు ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ స్టార్ గా తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం  నాగార్జున తాను కెరీర్ లో ఎప్పుడూ ఎదుర్కొనని సమస్యను ఎదుర్కుంటున్నాడు. వయసు అరవైకి చేరుకున్నా నవ మన్మధుడిగా కనిపించే ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్న నాగార్జున పక్కన హీరోయిన్ సమస్య వచ్చిందంటే నమ్మగలమా..! నాగార్జున కెరీర్లో ఎప్పుడూ ఊహించని సమస్య ఇదేనంటూ ఫిల్మ్ నగర్లో వార్తలు షికారు చేస్తున్నాయి.

 

 

ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు సోల్మన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి. హై టెక్నిక్ వాల్యూస్ ను ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా ఇప్పటికే పలువురు పేర్లు అనుకున్నారట. కానీ వారెవరూ ఈ సినిమా చేయటానికి ఉత్సాహం చూపలేదట. ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కూడా రిజెక్ట్ చేశారని సమాచారం. ఈ సినిమా అంతా సీరియస్ గా మంచి స్టోరీ కంటెంట్ తో రూపుదిద్దుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఆర్జీవీతో చేసిన ఆఫీసర్ సినిమా డిజాస్టర్ తర్వాత కూడా నాగార్జున మళ్లీ ఓ పోలీస్ పాత్ర అంగీకరించాడంటే కథలో దమ్ముంది కాబట్టే అంటున్నారు కొందరు.

 

 

అయితే.. నాగ్ సరసన నటించటానికి హీరోయిన్లు దొరక్కపోవడమే అర్ధం కాని విషయం. ఆఫీసర్ లో కూడా హీరోయిన్ అవసరం లేకుండా పోయింది. కానీ.. ఈ సినిమాలో గ్లామర్ ను తక్కువ చేయకూడదన్నది నాగ్ ప్లాన్. మరి ఈ వార్తల్లో నిజమెంతో.. ఏ హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తుందో తెలియాలంటే సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ వార్త వస్తేనే కానీ చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: