రష్మిక మందన్న టాలీవుడ్ ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టిన ఈ అమ్మడు, వరసగా హిట్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నది.  సినిమా పరంగా ఈ అమ్మడు మంచి దూకుడు మీదున్నది. అయితే, మహేష్ తో సినిమా చేయడం అంటే ఆమెకు పెద్ద పండగ అనే చెప్పాలి.  ఎందుకంటే పెద్ద స్టార్ తో చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.  ఈ సినిమా కోసం చాలా కష్టపడింది.  అంతకంటే ఎదురుచూసింది.  


సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పి ప్లాన్ చేసుకుంటోంది రష్మిక.  రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. అందరు మహేష్ బాబును చూసి భయపడితే, మహేష్ మాత్రం రష్మికకు భయపడిపోయేవాడట.  భయం అంటే ఆ భయం కాదు.  ఆమె అల్లరిని తట్టుకోలేక ఇరిటేషన్ వచ్చేదట.  ఆ ఇరిటేషన్ నుంచే ప్రేమ పుడుతుంది.  మనమీద ఉండే కోపమే ఇరిటేషన్ కు కారణం అని అంటున్నారు.  


ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాలో మరో కొన్ని సంచలనాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.  సూపర్ స్టార్ మెగా ఎంట్రీతో సినిమా మరో రేంజ్ లోకి వెళ్తుంది అంటున్నారు.  సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో రాబోతున్నది.  చాలా కాలం తరువాత సూపర్ స్టార్ కృష్ణ మరలా స్క్రీన్ పై కనిపించబోతున్నారు.  ఒకప్పుడు కృష్ణ సినిమాలు అంటే జనాలు ఎంతగా ఎదురుచూసేవారో చెప్పక్కర్లేదు.  


ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు కూడా అలాంటివే.  మహేష్ బాబు తండ్రి కృష్ణ అనిపించుకుంటున్నారు.  ఒక తండ్రికి అంతకంటే ఆనందం ఇంకేం కావాలి చెప్పండి.  అనిల్ రావిపూడి ఈ సినిమాను పక్కా ఎంటర్టైనర్ వేలోనే తీసారని అంటున్నారు.  మరి సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే కదా.  మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: