‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ విడుదలకు ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులలో మహేష్ ఒక్క క్షణం కూడ వృథా చేయకుండా ఈ మూవీ ప్రమోషన్ కోసం వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ చాల బిజీగా కాలం గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ చిరంజీవి తనను తన ఇంటికి రావద్దు అని చెప్పి తనకు షాక్ ఇచ్చిన విషయాన్ని బయట పెట్టాడు.  

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని అతిధిగా పిలవాలని తనకు నాలుగు నెలలు క్రితమే ఆలోచన వచ్చిన విషయాన్ని తెలియచేసాడు. దీనికి కారణం తనకు చిరంజీవి అంటే విపరీతమైన ఇష్టమని తాను మెగా స్టార్ ను స్పూర్తిగా తీసుకుంటాను అంటూ చిరంజీవి పై మహేష్ ప్రశంసలు కురిపించాడు. 

వాస్తవానికి తనకు వచ్చిన ఆలోచనను తాను తన నిర్మాతలకు కూడ షేర్ చేయలేదనీ అంటూ ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే తాను ఒకసారి చిరంజీవికి ఫోన్ చేసి తనకు ఒక కోరిక ఉందనీ అవసరమైనప్పుడు అడుగుతానని చెప్పి ముందుగానే చిరంజీవి అనుమతి తీసుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తాను మళ్ళీ చిరంజీవికి ఫోన్ చేసి తాను గతంలో అడిగిన కోరికను గుర్తుకు చేస్తూ తన ఫంక్షన్ కు అతిధిగా రావాలని అడగడంతో చిరంజీవి మరొక మాట మాట్లాడకుండా తన కోరికను మన్నించిన విషయాన్ని బయట పెట్టాడు. 

అయితే ఈ విషయమై తాను చిరంజీవి ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు చిరంజీవి తన ఇంటికి ఈ విషయమై రావద్దు అని చెపుతూ తనకు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పై ఉన్న గౌరవాన్ని వివరించి చిరంజీవి తన సంస్కారాన్ని చాటుకున్న విషయాలను మహేష్ ఈ ఇంటర్వ్యూలో తెలియచేసాడు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ అదేవిధంగా పొగడ్తలు పరిశీలిస్తే రాజకీయాలు తనకు తెలియవు అని చెప్పే మహేష్ చాల వ్యూహాత్మకంగా మాట్లాడడంలో చాల రాటుతేలాడు అని అనిపించడంలో సహజం..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: