‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్ షోలను చూసిన ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఈమూవీ టోటల్ గా త్రివిక్రమ్ మార్క్ మూవీ అని కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ఈమూవీ పై కూడ డివైడ్ టాక్ తప్పదా అన్న సందేహాలు వస్తున్నాయి. 

ఈమూవీకి సంబంధించి ఫస్టాఫ్‌ లో టబు రోహిణి మురళీ శర్మ జయరాం మధ్య ఎమోషనల్స్ సీన్స్‌ తో కథ మొదలై కామెడీ ఎమోషనల్ పాయింట్ల మీద కథను త్రివిక్రమ్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు అని తెలుస్తోంది. వీటికి యాక్షన్ సీన్‌ ను కూడ జత చేయడంతో త్రివిక్రమ్ మార్క్ మూవీలో ఒక మాస్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ గట్టి ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. 

ఈ సినిమాకు సంబంధించిన కథను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ త్రివిక్రమ్ తనదైన స్టైల్ లో ఈ మూవీ స్క్రీన్ ప్లే రాసిన పరిస్థితులలో ఈ మూవీ ఎంత వరకు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్న సందేహాలు కలుగుతున్నాయి. త్రివిక్రమ్ తెలివిగా పాటలు ఫైట్లు ఎమోషనల్ సీన్లను పేర్చుకొంటూ రోటిన్ కథను ఆసక్తిగా మలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేసాడని ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. అల్లు అర్జున్ పూజా మధ్య లవ్ కెమిస్ట్రీ కొత్తగా ఉంది అని కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

ఈ సినిమాకు సంబంధించిన అసలు కథను సెకండ్ హాఫ్ లో మొదలు పెట్టడంతో ఈ మూవీలో కథ లేకుండా కేవలం త్రివిక్రమ్ మ్యాజిక్ మాత్రమే కనిపిస్తోంది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో కూడా ఒక్క వినోదాన్ని బేస్‌ గా చేసుకొని యాక్షన్ ఎమోషనల్‌ తోనే కథను అల్లుకోవడంతో ‘అల’ మూవీ చూసిన ప్రేక్షకులు హాయిగా బయటకు వస్తారు కాని ఒక అద్భుతమైన సినిమాను చూసాము అన్న ఫీలింగ్ తో బయటకు వచ్చే అవకాసం తక్కువ అని ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో మహేష్ బన్నీ మూవీలలో సంక్రాంతి రేస్ లో విజేత ఎవరు అన్నది ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: