విజయ్ దేవరకొండ ఒక అదిరిపోయే గిఫ్ట్‌ ను ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ టైమ్ లో అల్లుఅర్జున్ కి పంపి షాక్ ఇచ్చాడు. ఈ గిఫ్ట్ ను చూసి అల్లు అర్జున్ కూడ షాక్ అయినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ పంపిన ఆ గిఫ్ట్‌ను బన్నీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

విజయ్ దేవరకొండ ‘రౌడీ బ్రాండ్ తో గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బ్రాండ్ పేరుతో తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల షోరూమ్స్ కూడ ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు వ్యాపారం పై దృష్టి పెడుతూ విజయ్ తన కెరియర్ ను చాల వ్యూహాత్మకంగా మలుచుకుంటున్నాడు. 

‘అల వైకుంఠపురములో’ రిలీజ్ సమయంలో బన్నీకి శుభాకాంక్షలు తెలియ చేస్తూ స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ను విజయ్ బన్నీకి బహుమతిగా పంపించాడు. అంతేకాదు ఒక  లెటర్ రాసిన విజయ్ బన్నీ అన్న ఈ బట్టలు స్పెషల్‌గా నేను డిజైన్ చేశానని చెప్పాడు. ఆ బట్టలను అందుకున్న బన్నీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘బట్టలను పంపినందుకు ధన్యవాదాలు మై డియర్ బ్రదర్ విజయ్.. రేపు అల వైకుంఠపురంలో విజయోత్సవ వేడుకల్లో ప్రేమతో పంపిన ఈ బట్టల్నేవేసుకుంటాను’ అంటూ ట్విట్ చేసాడు. 

దీనితో త్వరలో జరగబోతున్న ‘అల వైకుంఠపురములో’ సక్సస్ మీట్ లో బన్నీ విజయ్ పంపిన రొదీ గార్మెంట్స్ తో కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకోడ టాప్ యంగ్ హీరోలు అందరితో తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ తాను అందరివాడిని అని చెప్పే విధంగా టాప్ హీరోల సినిమాల విడుదల సందర్భంగా ఇలా రకరకాలుగా స్పందిస్తూ విజయ్ దేవరకొండ అజాత శత్రువుగా మారాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల టాప్ హీరోల అభిమానులు అంతా తన అభిమానులుగా మారి తన పై నెగిటివ్ కామెంట్స్ చేయరు అన్నది విజయ్ వ్యూహం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: