అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈరోజు విడుదలైంది. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ కావడంతో చాలా రోజులు గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి హిట్ సినిమాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 
 
అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ బంటు పాత్రలో కనిపిస్తాడు. ధనవంతుల కుటుంబంలోనే పుట్టిన బంటు మురళీశర్మ చేసిన కుట్ర వలన 25 సంవత్సరాల పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జీవించేస్తాడు. బంటూ పాత్రలో అల్లు అర్జున్ ఎక్కడా ఓవర్ కాకుండా నటించాడు. బంటూ క్యారెక్టర్ ను త్రివిక్రమ్ తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. సినిమా చూసేవారికి ఎక్కడా అల్లుఅర్జున్ కనపడడు. 
 
అల్లు అర్జున్ నటించిన బంటు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బంటు పాత్రలో బన్నీ నటించాడు అనే కంటే ఏకంగా జీవించేశాడని చెప్పవచ్చు. అల్లు అర్జున్ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ ఫెర్పామెన్స్ ఇచ్చాడు. సినిమాలో క్లాస్ గా కనిపిస్తూనే మాస్ అప్పీల్ తో బన్నీ అదరగొట్టాడు. ఫైట్లలో, కామెడీ సన్నివేశాలలో, ఎమోషనల్ సన్నివేశాలలో అద్భుతంగా నటించి అల్లు అర్జున్ బంటు పాత్రలో మెప్పించాడు. 
 
సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా బన్నీ ఈ సినిమాను తెరకెక్కించాడు. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్ తన సినిమాలతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నాడు. సినిమా చూసే కొద్దీ ఆసక్తిని పెంచుతూ ప్రేక్షకుల అంచనాలను అందుకోవటంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు. అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కెరీర్లలో మరో హిట్ చేరినట్లే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: