అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.  సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటుగా వసూళ్ల పరంగా కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది.  త్రివిక్రమ్ దర్శకత్వంతో పాటుగా బన్నీ కంప్లీట్ యాక్షన్ తో సినిమాకు మంచి పేరు వచ్చింది.  థమన్ అందించిన సంగీతం ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో నెక్స్ట్ సినిమాపై బన్నీ దృష్టి పెట్టారు.  


బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమా చేస్తున్నారు.  ఇప్పటికే ఈ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2లు ఏ స్థాయిలో విజయం సాధించాయో చెప్పక్కర్లేదు.  ఇప్పుడు మూడో సినిమా రాబోతున్నది.  ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన సినిమా ఇది.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.  కేరళలో ఓ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేశారు.  వచ్చే నెల మొదటివారం నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.  


ఈ షెడ్యూల్ లో బన్నీ కూడా పాల్గొనబోతున్నారు.  ఇదిలా ఉంటె, ఇందులో విజయ్ సేతుపతి విలన్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తోంది.  ఈరోజు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా యూనిట్ ఈ అనౌన్సమెంట్ ఇచ్చింది.  ఇది సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది.  ఎందుకంటే విలన్ గా ఇప్పటికే విజయ్ సేతుపతి తానేంటో నిరూపించుకున్నాడు.  తెలుగులో ఉప్పెన సినిమాలో విజయ్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

 
కాగా, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆయన విలన్ గా చేస్తున్నారు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తున్న విజయ్ సేతుపతికి ఇది మంచి ఛాన్స్ అవుతుంది.  తెలుగులో ఇప్పటికే తమిళ స్టార్స్ ఎందరో మంచి పేరు తెచ్చుకున్నారు.  అదే విధంగా ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  ఉప్పెన సినిమాను సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ 20 వ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: