సంక్రాంతికి మహేశ్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమాలు మొదటి నుంచీ పోటీపడుతున్నాయి. రిలీజ్ డేట్ల నుంచి ఇప్పుడు ధియేటర్లు, కలెక్షన్లు వరకూ ఈసారి పోటీ మహా రంజుగా నడుస్తోంది. ఈ పోటీలో బన్నీ అల.. వైకుంఠపురములో సినిమా మహేశ్ సరిలేరు నీకెవ్వరు కంటే ఓ మెట్టు పైనుంది. మహేశ్ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్లను బన్నీ మూడు రోజుల్లోనే సమం చేసేశాడు. ఇప్పటికీ అల.. సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఎక్స్ ట్రా షోలు, ధియేటర్ల పెంపు, స్పీడ్ ఫుల్స్ తో నడుస్తోంది.

 

 

బన్నీ హవా యూఎస్ లోనూ కొనసాగుతోంది. తొలి రోజు ప్రీమియర్ల నుంచి ఇప్పటి వరకూ అక్కడ కూడా మహేశ్ పై పైచేయి సాధించాడు బన్నీ. అల.. సినిమాకు వచ్చిన టాక్, క్రేజ్, క్రౌడ్ దృష్ట్యా నేటి నుంచి యూఎస్ లో 15 స్క్రీన్స్ పెంచుతున్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో లాభాల బాట పట్టారు అల డిస్ట్రిబ్యూటర్లు. యూఎస్ పంపిణీదారులు కూడా లాభాల బాట పట్టనున్నారు. నిజానికి మహేశ్ కు యూఎస్ క్రేజ్ ఎక్కువ. కానీ బన్నీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మహేశ్ స్ధాయి కలెక్షన్లు సరిలేరు.. కు లేవు. ఇప్పటికే 2020 సంక్రాంతి విన్నర్ గా ప్రకటించుకున్న అల.. వైకుంఠపురములో సినిమా యూఎస్ లోనూ బన్నీ కెరీర్ లోనే కొత్త రికార్డులకు తెరదీయనుంది.

 

 

గత కొన్నాళ్లుగా చేస్తే మహేశ్ సినిమాకు యూఎస్ మార్కెట్ ఏమాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి. మహర్షి సినిమా కూడా అక్కడ మహేశ్ స్థాయికి తగ్గట్టు రన్ కాలేదు. సరిలేరు  నీకెవ్వరు కూడా కలెక్షన్లు వస్తున్నా బన్నీ ముందు తేలిపోయాడనే చెప్పాలి. ఈ వీకెండ్ కు బన్నీ అల..తో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: