మహేష్ బాబు సినిమాలంటే ప్రతి ఒక్కరిని ఇష్టం ఉంటుంది.  అయన సినిమా హిట్టయితే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  కెరీర్లో ఇప్పటి వరకు 26 సినిమాలు చేసిన మహేష్ బాబు, తన కెరీర్లో గతంలో బెస్ట్ సినిమా ఏది అంటే ఒక్కడు అని చెప్పేవారు.  ఆ సినిమా మాస్ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చింది.  సినిమాను గుణశేఖర్ చాలా కొత్తగా తీశాడు.  స్పోర్ట్స్ డ్రామా, ఫ్యాక్షన్ రాజకీయం మిక్స్ చేసి సినిమాను రన్ చేశారు.  ఈ సినిమాకు వేసిన భారీసెట్ అందరిని ఆకట్టుకుంది.  


2003 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సొంతం చేసుకుంది.  అప్పటి వరకు మహేష్ బాబుకు హిట్స్ ఉన్నాయి.  కానీ, బ్లాక్ బస్టర్ అనిపించే హిట్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.  మొత్తానికి ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.  అయితే గుణశేఖర్ ఈ సినిమాను ఎంచుకున్న విధానం, స్పోర్ట్స్ డ్రామా అన్ని కూడా పేపర్లో చదివిన అంశాన్ని బట్టి ఎంచుకున్నారు. గుణశేఖర్ మృగరాజు సినిమా ప్లాప్ కావడంతో ఆయనపై వ్యతిరేకత వచ్చింది.  ఆ సమయంలో ఎలాగైనా మంచి విజయం అందించాలని ఆశించాడు.  


అదే సమయంలో పేపర్లో వచ్చిన న్యూస్ చూశారు.  అది పుల్లెల గోపీచంద్ స్టోరీ.  తండ్రికి స్పోర్ట్స్ వైపు వెళ్లడం ఇష్టం లేదు.  కానీ, పుల్లెల గోపీచంద్ కష్టపడి బ్యాడ్మింటన్ నేర్చుకొని అందులో సక్సెస్ అయ్యాడు.  తండ్రికి ఇష్టం లేకపోయినా గేమ్ ను గెలిచి, రాష్ట్రానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చారు.  దీనిని స్ఫూర్తిగా తీసుకొని గుణశేఖర్ కథను తయారు చేసుకున్నారు.  ఎంఎస్ రాజు నిర్మాత.  అయితే, మొదట ఆ సినిమాకు అతడే ఆమె సైన్యం అని అనుకున్నా ఆ పేరు ఎవరో తీసుకున్నారు.  


కానీ గుణశేఖర్ వదలకుండా ఈ సినిమాకు మంచి పేరు పెట్టాలని, ఇందులో హీరోయిన్ భూమికను రక్షించే వ్యక్తి మహేష్ బాబు ఒక్కడే కాబట్టి, ఆ సినిమాకు ఒక్కడు అనే టైటిల్ అయితే యాప్ట్ అవుతుందని భావించి ఆ పేరు పెట్టారు.  అనుకున్నట్టుగానే ఒక్కడు సినిమాకు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఒక్కడు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.  అంతేకాదు అందులోని చార్మినార్ సెట్ తో పాటు కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర తీసిన సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.  సినిమాకు కొండారెడ్డి బురుజు హైలైట్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: