రష్మిక మందన్న టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్.  వరస సినిమాలతో దూసుకుపోతున్నది.  ఛలో అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సొంతం చేసుకున్న ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం చేసింది.  అందులో కొంచం గ్లామరస్ గాను, ఇంకొంచెం సెక్సీగాను కనిపించింది.  నాభి అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది.  చీరకట్టులో మెప్పించింది.  


ఇంకేముంది రష్మిక మాయలో పడిపోయారు యూత్ సినిమాను సూపర్ హిట్ చేశారు.  అంతే సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.  ఈ సినిమా తరువాత ఈ అమ్మడు కొన్ని సినిమాలు చేసింది.  అవి పెద్దగా హిట్ కాలేదు.  కాకపోతే మంచి సినిమాలుగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నాయి.  2020 సంక్రాంతి ఆమెకు మరుపురాని విజయం అందించింది.  అదే సరిలేరు నీకెవ్వరూ సినిమా.  


ఈ మూవీతో ఆమెకు టాప్ పొజిషన్ కు చేరుకుంది.  మహేష్ బాబు సినిమాలు ఆయన్ను టీజ్ చేస్తూ ఈ సినిమా చేసింది.  ఈ సినిమా విజయం తరువాత రష్మికకు వరస అవకాశాలు రావడం ఖాయం అని తేలిపోయింది.  అయితే, ఇక్కడ తెలియాల్సింది ఏమంటే, రష్మిక తన సినిమాతో ఎంతగా ఆకట్టుకుంటుందో, అదే విధంగా తన ఫిట్నెస్ తోనూ ఫిజిక్ తోనూ ఆకట్టుకోవాలి.  


టాప్ హీరోయిన్లకు ఫిట్నెస్ చాలా అవసరం ఈ సంగతి అందరికి తెలుసు.  ఫిట్నెస్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి.  అందుకే సినిమా రంగంలో ఉండే వ్యక్తులు తప్పకుండా జిమ్ చేస్తుంటారు.  సమంత, రకుల్ ప్రీత్ లు నిత్యం జిమ్ చేస్తూ ఫిట్నెస్ తో పాటుగా ఫిజిక్ ను కూడా కాపాడుకుంటున్నారు.  తాజాగా ఈ లిస్ట్ లో రష్మిక కూడా చేరిపోయింది.  రష్మిక తన ఫిట్నెస్ ను కాపాడుకోవడం కోసం జిమ్ లో వర్కౌట్ చేస్తున్నది.  అల్లు అర్జున్ సినిమాలో ఫిట్ గా కనిపించేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: