తెలుగు వివాదాస్పద దర్శకుడు ఏం చేసిన కూడా అది సంచలం గా మారుతుందన్న విషయం తెలిసిందే.. అయితే వర్మ ఎప్పటి నుండో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఒక సినిమా విడుదల అయిందంటే ఈ సినిమాలోని సభ్యులు వర్మ నోటికి పని చెప్పినట్లే. ఆ సినిమా ఎలా ఉన్న వర్మ విమర్శల ముందు అది పరారే.. 

 


మొదటి నుండి వర్మ ఎం చేసిన కూడా అది పలు చర్చలకు దారి తీస్తుంది. అందుకే వర్మ పేరు కాస్త వివాదాల వర్మగా పేరు కూడా మారింది. అందుకే వర్మ ఎం చేసిన కూడా వివాదమనే చెప్పాలి. సినిమాలు తీయడం కన్నా కూడా బయట గాలి వార్తల్లో నిలుస్తూ వర్మ బాగా ఫెమస్ అయ్యాడు. అందుకే వర్మ వార్తల్లో వినపడుతుంటాడు. 

 


ఇది ఇలా ఉండగా మరో సారి వర్మ మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. మెగా కుటుంబం లో పవర్ స్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమే నని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా లో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, అల్లు రామలింగయ్యకు నిజమైన వారసుడిని తానేనని అల్లు అర్జున్ నిరూపించుకున్నారని వర్మ ప్రశంసలు కురిపించారు.

 

 

మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ అల్లు అర్జున్ కు కరెక్ట్ గా షూట్ అవుతుందని వర్మ అనడంతో మెగా అభిమానుల ఆగ్రహానికి వర్మ గురయ్యాడు. మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఆల్రెడీ మెగా వారసుడు రామ్ చరణ్ కు ఉండగా వర్మ ఇలా అనడమేంటి అంటూ కాలు రువ్వుతున్నారు. ప్రస్తుతం వర్మ చేసిన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: