సంక్రాంతి రేసు ఫలితం తేలిపోయి బన్నీ సంక్రాంతి విన్నర్ గా మారిపోయి తన ‘అల వైకుంఠపురములో’ సృష్టిస్తున్న సంచలనాలు ఆగడం లేదు. ఈమూవీ త్వరలోనే ‘రంగస్థలం’ నెట్ కలక్షన్స్ రికార్డును కూడ బ్రేక్ చేస్తుంది అని వార్తలు రావడమే కాకుండా ఈఏడాది టాప్ 3 హిట్స్ జాబితాలో ‘అల’ స్థానం ఖాయం అన్న అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి మహేష్ మ్యానియా ముందు అల్లు అర్జున్ మ్యానియా ఏస్థాయిలోను సరితూగాలేరు. 

అయితే అలాంటి మహేష్ ను ఈ సంక్రాంతి రేస్ లో కేవలం రెండవ స్థానానికి పరిమితం చేసిన ‘అల’ మ్యానియాను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మహేష్ కొందరు భజన పరుల మాయలో పడి సరైన సినిమాలను ఎంచుకోలేక పోతున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి గత ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చిన ‘మహర్షి’ సినిమాలో కూడ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాల్లో రైతు సంబందించిన ఎలిమెంట్ తప్ప మిగతా సీన్స్ అన్నీ రొటీన్ అయినప్పటికీ క్రితం సవత్సరం సమ్మర్ రేస్ లో మహర్షికి పోటీ ఇచ్చే టాప్ హీరో సినిమా ఏది లేకపోవడంతో ఆ సినిమాగట్టెక్కింది అన్న కామెంట్స్ ఉన్నాయి.

ఇక లేటెస్ట్ గా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు' మూవీ సెకండ్ హాఫ్ కూడ తేడా కొట్టడం ఈ మూవీలోని ట్రైన్ ఎపిసోడ్ కూడా ఏమాత్రం ప్రేక్షకులను నవ్వించ లేకపోవడంతో పాటు చాలామంది ప్రేక్షకులకు నీరసం తెప్పించడంతో ‘అల’ మ్యానియా ముందు ‘సరిలేరు’ ఆగలేకపోయింది. అయితే ఈ వాస్తవాలు అన్నీ పక్కకు పెట్టేసి మహేష్ దగ్గర ఉండే సన్నిహితులు మాత్రం ‘సరిలేరు’ సూపర్ హిట్ అంటూ చెప్పిన మాటలను నమ్మి మహేష్సినిమా విజయోత్సవ సభలో తన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెప్పుకోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

వాస్తవానికి మహేష్ కు ‘శ్రీమంతుడు’ రేంజ్ హిట్ ఆ తరువాత విడుదలైన ఏ సినిమాకు రాలేదనీ మిగతా సినిమాలు అన్నింటిని హిట్ అనే ప్రచారం మాత్రమే చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో తనకు బ్లాక్ బష్టర్ హిట్ ను అందివ్వగల దర్సకుదుని మహేష్ ఎంచుకోకుండా తన చుట్టూ భజన చేసే దర్శకులకు అవకాశాలు ఇస్తూ మహేష్ తప్పు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: