సంక్రాంతికి వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమాతో తన మ్యూజిక్ లో ఉన్న మ్యాజిక్ ఏంటో రుచి చూపించాడు థమన్. ఓదశలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజీషియన్ గా పేరు తెచ్చుకుని అతి తక్కువ సమయంలో 50 సినిమాల మైలురాయిని చేరుకుని రికార్డు క్రియేట్ చేశాడు థమన్. దేవీశ్రీప్రసాద్ కూడా అంత త్వరగా ఆ ఫిగర్ కు చేరుకోలేదు. ఆగడు తర్వాత థమన్ మ్యూజిక్ పవర్ తగ్గడం అదే సమయంలో దేవీ అదిరిపోయే మాస్ బీట్లతో టాలీవుడ్ లో చెలరేగిపోయాడు. అయితే అల..తో థమన్ మళ్లీ తన మునపటి ఫామ్ నే అందిపుచ్చుకున్నాడనే చెప్పాలి.

 

 

అల.. సినిమాలో ఒక్కో పాట ఒక్కో బెంగాలీ రసగుల్లాలా ఉండటంతో సినిమా భారీ విజయం సాధించింది. దీంతో థమన్ పేరు మోగిపోతోంది. ఇప్పుడు థమన్ మళ్లీ రీబ్యాక్ అయి వరుసగా ఆఫర్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం తన డెయిరీలో మరో రెండేళ్ల వరకూ ఖాళీ అనే మాటే లేదు. అన్ని సినిమాలోతో బిజీ అయిపోయాడు. తొలిప్రేమ, భాగమతి, అరవింద సమేత.. ఇలా అందుకున్న థమన్ వరుసగా వెంకీమామ, ప్రతిరోజూ పండగే, అల.. ఇలా తన హవా కొనసాగిపోతోంది. ప్రస్తుతం అతని చేతినిండా సినిమాలే ఉన్నాయి. పవన్ కల్యాణ్ మూవీ, మహేశ్-వంశీ పైడిపల్లి సినిమా, కీర్తి సురేశ్ మిస్ ఇండియా, రవితేజ్ క్రాక్, వరుణ్ బాక్సర్.. ఇలా చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి.

 

 

ముఖ్యంగా పవన్, మహేశ్ సినిమాలకు మ్యూజిక్ అంటే ఖచ్చితంగా వారి స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వాల్సిందే. వచ్చిన చిక్కల్లా వరుసగా సినిమాలు ఉంటే తనలోని మ్యాజిక్ తగ్గుతుంది. ఒకే తరహాలో పాటలు ఇస్తాడు. ఇదే తనని ఆగడు తర్వాత స్లో అయ్యేలా చేసింది. ఈసారన్నా ఆ తప్పు రిపీట్ కాకుండా ఇదే స్థాయి సంగీతం అందిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: