నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని కొనసాగిస్తున్న చిరంజీవికి గతవారం సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరాభవం ఎదురైతే తమిళనాడులో ఊహించని ఆదరణ ఎదురుకావడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో చిరంజీవి ఎంతో కష్టపడి భారీ బడ్జెట్ తో తీసిన ‘సైరా’ ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్ప బాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించ లేకపోవడంతో పాన్ ఇండియా మూవీగా చరిత్ర సృష్టిస్తుంది అని భావించిన ‘సైరా’ కేవలం తెలుగు సినిమాగానే మిగిలిపోయింది. 

వాస్తవానికి ఈ మూవీకి సంబంధించి భారీ బడ్జెట్ అవ్వడంతో ఈ మూవీ వల్ల నిర్మాత రామ్ చరణ్ కు నష్టాలు వచ్చినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అయినప్పటికీ తన తండ్రికి చరిత్రలో నిలిచిపోయే సినిమాను నిర్మించిన తృప్తిలో చరణ్ ఉన్నాడు. 

ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో గత వారం సంక్రాంతి సందర్భంగా బుల్లితెర పై జెమిని టివి ఛానల్ లో ప్రసారం అయిన ‘సైరా’ ను ఎవరు పట్టించుకోకపోవడంతో కేవలం 8.7 టివి రేటింగ్స్ రావడంతో ఆ సినిమాను ప్రసారం చేసిన జెమినీ టివి వర్గాలు షాక్ అయినట్లు టాక్. అయితే అదే సంక్రాంతి రోజున జెమిని టివి తమిళ ఛానల్ లో ‘సైరా’ మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ కు 15.4 రేటింగ్స్ రావడంతో ఆ వార్తలు విన్న మెగా కాంపౌండ్ ఆశ్చర్య పోతోంది. 

వాస్తవానికి ‘సైరా’ మూవీని ఆ సినిమా విడుదల అయినప్పుడు తమిళ ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆ మూవీకి తమిళనాడులో కనీసపు కలక్షన్స్ కూడ రాలేదు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయి తమిళ బుల్లితెర ప్రేక్షకులు చిరంజీవిని బాగా పట్టింకుంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులు చిరంజీవిని పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారడమే కాకుండా బుల్లితెర పై ఏసినిమాను బుల్లితెర ప్రేక్షకులు చూస్తారో చూడరో అనే ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: