ప్రస్తుతం ఇండస్ట్రీలో పేరు గాంచిన ప్రతి సెలెబ్రెటీ ఒక ఖరీదైన కార్ వాన్ ను పెట్టుకోవడం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. వీటి ధర కోట్ల రూపాయలలో ఉంటున్నా పట్టించుకోకుండా హీరోలు హీరోయిన్స్ తో పాటు ప్రముఖ సాంకేతిక నిపుణులు కూడ తమ స్థాయికి తగ్గట్టుగా కార్ వాన్ లు ఏర్పాటు చేసుకోవడం ఒక కల్చర్ గా మారింది.

ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కొరటాల చిరంజీవి కాంబినేషన్ మూవీ షూటింగ్ స్పాట్ లో లెక్కకు మించి కార్ వాన్ ల సంఖ్య కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో నటిస్తున్న చిరంజీవితో పాటు దర్శకత్వం వహిస్తున్న కొరటాల కూడ తనకంటూ ఒక ప్రత్యేకమైన కార్ వాన్ ను ఏర్పాటు చేసుకున్నాడట. 

ఇది చాలదు అన్నట్లుగా  ఈ సినిమాకుసంబంధించి కెమరామెన్ గా పని చేస్తున్న రత్నవేలుతో పాటు ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తున్న చిరంజీవి కూతురు సుష్మితకు కూడ రెండు ప్రత్యేకమైన కార్ వాన్ లు ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మధ్య మధ్యలో షూటింగ్ స్పాట్ కు వచ్చే రామ్ చరణ్ కు కూడ ఒక ప్రత్యేకమైన కార్ వాన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

దీనితో ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో మామూలు స్థాయిలో క‌న్నా రెండింత‌లు మూడింత‌ల‌లో కార్‌ వాన్ లు నిలబడి ఉండటంతో ఆ  వ్యాన్ లో ఉన్న వారికి స‌ప్ల‌య్ చేయ‌లేక ఈ మూవీ ప్రొడ‌క్ష‌న్ సిబ్బంది గోల చేస్తున్నార‌ని వార్తలు హడావిడి చేస్తున్నాయి. చిరంజీవి  152వ సినిమాగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ను నైట్ ఎఫెక్ట్‌లో సాగే పాట చిత్రీకరణతో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను అతి తక్కువ రోజులలో పూర్తి చేయాలి అని చిరంజీవి ఇచ్చిన టార్గెట్ తో కొరటాల టెన్షన్ పడుతున్నట్లు సమాచారం..     

మరింత సమాచారం తెలుసుకోండి: