బుల్లితెర మీద అల్లరల్లరి చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యాంకర్ ప్రదీప్ కూడా హీరో అయిపోయాడు. గడసరి అత్తా సొగసరి కోడలు అంటూ బుల్లితెరపైకి వచ్చి అర్థంపర్థం లేకుండా మాట్లాడిన ప్రదీప్ కూడా హీరో అయిపోయాడు.. నిజానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ప్రదీప్ ని గుర్తించలేదు అనుకోండి..  

 

కొంచం టచ్ లో ఉంటె చెప్తా.. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అంటూ చేసుకుపోయే ప్రదీప్ మొన్న ఓ యాక్సిడెంట్ కారణంగా కొద్దీ రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ఈ మధ్యే అదిరింది షో తో మళ్లీ ఫార్మ్ లోకి వచ్చాడు. అయితే అలా యాంకరింగ్ కి ఫార్మ్ లోకి వచ్చాడో లేదో ఇలా సినిమాలలోకి అడుగు పెట్టేశాడు.. 

 

అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన యాంకర్ ప్రదీప్ ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. కాగా ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు.   

 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రేమోషన్స్ ప్రారంభించింది చిత్ర యూనిట్. దీంతో నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్లను యాంగ్ హీరో రానా రిలీజ్ చేశారు. ఈ మేరకు రానా తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. పోస్టర్ తో మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉందని అయన అభినందించారు. 

 

అయితే సినిమా లుక్ డిఫరెంట్ గా ఉన్న.. ప్రదీప్ పల్లెటూరు యువకుడిలా కనిపించాడు.. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అమృత అయ్యర్ లుక్ ను కూడా పోస్టర్ లో రిలీజ్ చేశారు. అయితే సినిమా ఫస్ట్ లుక్, సినిమా పేరు, సినిమా సంగీతం అన్ని కొత్త కాన్సెప్ట్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కనిపిస్తుంది. 

 

బుల్లితెరపై తన అదృష్టంతో స్టార్ యాంకర్ అయినా యాంకర్ ప్రదీప్ ఇప్పుడు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి దుమ్ముదులుపుతున్నాడు.. ఇన్నాళ్లు హీరో ఛాన్సుల గురించి ఏమాత్రం పట్టించుకోని యాంకర్ ప్రదీప్ ఇప్పుడు సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.. అంతేలే.. జబర్దస్త్ కామెడీ యాక్టర్లే హీరోలు అయ్యారు.. ప్రదీప్ కాకూడదా ఏంటి అని నెటిజన్లు అంటున్నారు.. మరి ఈ కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటి?

మరింత సమాచారం తెలుసుకోండి: