సినిమాల్లో హిట్ కాంబినేషన్లు రిపీట్ కావడం సహజమే. కొన్నిసార్లు కొన్ని పాత్రలకు వీళ్ళు మాత్రమే సూటవుతారని దర్శకుడు భావిస్తే ఆయా నటులను ఏరికోరి ఎంపిక చేస్తారు. కొంతమంది రిపీట్ గా నటులను తీసుకోరు. అందులో రాజమౌళి కూడా ఉన్నారు. ఆయన ఇన్నేళ్ల కెరీర్ లో హీరోలను రిపీట్ చేశారు కానీ హీరోయిన్లను తీసుకోలేదు. అలా ఒక్క అనుష్కను తప్పించి మరెవరినీ తీసుకోలేదు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ను తన ఆర్ఆర్ఆర్ సినిమాకు రిపీట్ చేస్తున్నారని సమాచారం.

 

 

ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా నటించిన శ్రియను రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ మూవీలో ఓ ముఖ్య పాత్రకు తీసుకున్నట్టు తెలుస్తోంది. కథలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కు జోడీగా శ్రియను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సెట్లో తన పాత్ర చిత్రీకరణ కోసం పాల్గొన్నాడు అజయ దేవ్ గన్. శ్రియ కూడా సెట్లో తన పాత్ర కోసం జాయిన్ అయిందని సమాచారం. శ్రియ ఇంతవరకూ పెద్దగా వీరోచితమైన పాత్రలు చేయకపోయినా అందుకు తగ్గ లుక్స్, ఫిజిక్ శ్రియ దగ్గర ఉన్నాయి. ఈ కారణంతోనే రాజమౌళి ఆ పాత్రకు శ్రియను ఎంపిక చేసి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

 

వీరోచిత పాత్రలకు అజయ్ దేవ్ గణ్ సరిగ్గా సూట్ అవుతాడని పేరుంది. ఇటీవల ఆయన నిర్మించి, నటించిన తానాజీ సినిమానే ఉదాహరణ. ఆయన పాత్ర వీరోచితంగా ఉండి సినిమా హిట్ లో ఆయన నటన కీలకంగా మారింది.  ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ ఏడాది దసరా పండగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: