మెగా ప్రిన్సెస్ నిహారిక నటించిన సినిమాలు అన్ని ఫెయిల్ అవడంతో ఆమె తన హీరోయిన్ కెరియర్ స్వస్తి పలికి ఇక వెబ్ సిరీస్ కు మాత్రమే పరిమితం అవుతుందనీ అదేవిధంగా ఆమెకు పెళ్ళి చేయాలని నాగబాబు ప్రయత్నిస్తున్నాడని మీడియాలో అనేక సార్లు వార్తలు సందడి చేసాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ ఇప్పుడు నిహారిక ప్రత్యేకంగా ముంబాయి వెళ్ళి అక్కడ చాల పేరుగాంచిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ తో ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ తీయించుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఈ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు లీక్ కావడంతో ఇలాంటి ఫ్యాషన్ ఫోటో షూట్ ను నిహారిక ఎందుకు తీయించుకుంది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చాల కంపెనీలు తమ ప్రొడట్స్ ప్రచారం కోసం సెలెబ్రెటీ లను బ్రాండ్ అంబాసిడర్ లుగా పెట్టుకుని భారీ పారితోషికాలు ఇస్తున్న నేపధ్యంలో అలాంటి ఎసైన్మెంట్ కోసం నిహారిక ఈ ఫోటో షూట్ ఇచ్చిందా అంటూ సందేహాలు వస్తున్నాయి. 

మరికొందరైతే నిహారిక ఈ మధ్య తరుచు ముంబాయి వెళ్ళి వస్తూ అక్కడ అనేక ఆడిషన్స్ లో పాల్గొంటోంది అనీ దీనితో ఆమె త్వరలో ఒక బాలీవుడ్ మూవీలో నటించినా ఆశ్చర్యం లేదు అంటూ మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. దీనితో ఈ ఫోటో షూట్ కేవలం సరదా కోసం చేసింది కాదని దీనివెనుక ఎదో ఒక ఉద్దేశ్యం ఉంది అని అంటున్నారు.

ఇది ఇలా కొనసాగుతూ ఉంటే నిహారిక తాను సొంతంగా ఒక ప్రొడక్షన్ హోస్ ను ఏర్పరిచే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. తన సొంత బ్యానర్ పై కొత్త వారితో సినిమాలు తీస్తూ వాటిని రిలీజ్ చేసి తన అభిరుచిని చాటుకోవడమే కాకుండా తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కూడ కొనసాగించాలని నిహారిక చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మరో రెండు మూడు సంవత్సరాలు వరకు నిహారిక పెళ్ళి ఆలోచనలు లేనట్లే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: