హీరోయిన్ గా అవకాశం వచ్చిందంటే.. ఇక ఆ అమ్మాయి పంట పండినట్టే.. అందులోనూ కాస్త పేరున్న హీరో పక్కన ఛాన్స్ వస్తే.. అది కాస్తా హిట్ అయితే.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.. అలా హీరోయిన్ ఛాన్స్ రాకపోతే.. ఎంత అందంగా ఉంటే మాత్రం ఉపయోగం ఏముంటుంది.. అందుకే అందమైన భామలంతా ఒక్క చాన్స్ అంటూ నిర్మాతల వెంటపడుతుంటారు.

 

మరి కాస్తో కూస్తే ఛాన్స్ వచ్చినా నిలదొక్కుకోకపోతే.. అగ్రతారగా వెలుగొందే అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోతే.. పాపం.. ఇప్పుడు సాక్షి చౌదరిది అదే పరిస్థితి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా అనుకుంటున్నారా.. అవును.. ఇప్పుడిలా బాత్ టబ్బులో అందాలు ఒలకబోస్తున్న అమ్మాయి పేరే అది.

 

2011లో గ్లాడ్రాగ్స్ మెగామోడల్ కాంటెస్టులో విజేత అయ్యిందీ అమ్మడు.. ఆ తర్వాత సినీ ట్రయల్స్ వేసింది. 2013లో మంచు మనోజ్ సరసన పోటుగాడు అనే సినిమాతో తెరకు పరిచయమైంది. హమ్మయ్య అనుకుంది . అది కాస్తా ఫ్లాప్.. ఆ తర్వాత.. అల్లరి నరేష్ సరసన జేమ్స్ బాండ చిత్రంలో అదీ అంతే.. మళ్లీ నరేష్ తోనే సెల్ఫీ రాజాలో నటించింది. అబ్బే అదీ హిట్ కొట్టలేదు. గోపిచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రంలోనూ ఆడిపాడింది.

 

పెద్దగా ఫలితం లేకపోయింది. పాపం.. ఇలా ఎంత ప్రయత్నించినా స్టార్ డమ్ మాత్రం అందని ద్రాక్షనే అయ్యింది ఈ సాక్షి చౌదరికి.. అందుకే ఇలా వేడెక్కించే ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. ఎలాగైనా సరే.. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల పరాజయానికీ తన అందాలకూ ఏమాత్రం సంబంధం లేదని చాటి చెప్పాలని ప్రయత్నిస్తోంది. పాపం.. నిర్మాతలు మాత్రం ఇంతగా అందాలు ఆరబోసినా పెద్దగా పట్టించుకున్నట్టు లేదు.. మరి ఇలాగైనా నిర్మాతలు అమ్మడి అందాన్ని గుర్తిస్తారా.. మరో ఛాన్స్ ఇస్తారా.. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: