అగ్ర కథానాయకులు సమంత శర్వానంద్ లు కలిసి జంటగా నటిస్తున్న సినిమా జాను...తమిళ్లో విదలయ్యి మంచి విజయాన్ని అందుకున్న సినిమా 96 రీమేక్ లో నటిస్తున్నారు.. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.. మొదటి నుండి సినిమా పోస్టర్ ను నుండి ఈ సినిమాకు జనాల్లో మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.. అందుకే ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నారు..

 

ఇకపోతే ఈ సినిమా నుండి తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు..ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్ నాని హాజరయ్యారు..ఈ ఈవెంట్‌కి వచ్చిన నాని అభిమానులకు, సమంత అభిమానులకు, నా అభిమానులకు చాలా థాంక్స్. సమంత గురించి మాట్లాడమంటున్నారు చాలా మంది.. ఆమె గురించి మాట్లాడాలంటే.. ఆమె చాలా డేంజరస్. ఎందుకంటే చాలా మంది హీరోలకు పలానా హీరోయిన్‌తో చేయాలంటే ఆలోచించుకుంటామ్. ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్లతో చేస్తున్నప్పుడు వాళ్లు బెటర్ పెర్ఫామెన్స్‌తో తినేస్తారు.

 

అంతేకాకుండా..నిత్యామీనన్, సాయి పల్లవి, సమంత లాంటి హీరోయిన్లతో సినిమా అనగానే కొంచెం మనం అలర్ట్ అవ్వాలన్నమాట. అంటే వాళ్లను దాటలేం కాని.. వాళ్లతో సమానంగా నటించాలి. సమంతతో నటించడం నాకు ఇదే తొలిసారి. సమంత సక్సెస్ సీక్రెట్ ప్రకారం ఆమె చేసే ప్రతి సినిమాను ఫస్ట్ సినిమాగానే భావిస్తుంది. ఇప్పటికీ అలాగే చేస్తోంది... వీరందితో అబ్బాయిలు చేయాలంటే తప్పక ప్రిపేర్ అవ్వాలి అంటూ సమంతను కొనియాడారు..

 

ఆరో తరగతి అబ్బాయి నుండి 80 ఏళ్ల వరకూ అందరికీ ఈసినిమా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే.. జీవితంలో ఏది జరిగినా ఎన్ని లవ్‌లు వచ్చినా.. ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్వే. ఈ సినిమా చూస్తున్నంత సేపూ... ఈ సీన్ నాది కదరా అని ఇన్వాల్వ్ అవుతారు. నా లవ్ స్టోరీ కూడా జాను లవ్ స్టోరీ మాదిరే ఉంటుంది. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు...అందుకే ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది.. అందుకే నేనే ఉన్న అనుకోని చేశాను అంటూ శర్వా అన్నాడు.. ఫిబ్రవరి 7 లో ఈ సినిమా విడుదల కానుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: