జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి సినిమాల బాట పట్టారు. ఇప్పటికే మూడు సినిమాల వరకూ కన్ ఫామ్ అయ్యాయి. పింక్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లోపు దాదాపు 5 సినిమాలు చేయాలని పవన్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ తిరిగి సినిమాల్లో బిజీ కావడాన్ని వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది.

 

గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలనే ఇందుకు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు.

వైఎస్‌ జగన్‌ అద్భుతంగా పరిపాలిస్తే తిరిగి సినిమాల్లోకి వెళతానని గతంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఈ మాటలను వైసీపీ నేతలు బాగా వాడేసుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ పాలన అద్భుతంగా ఉన్నందువల్లే పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారని వైసీపీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారమే సినిమాలు చేసుకుంటున్నారని.. పవన్‌ చర్యలతో సీఎం వైఎస్‌ జగన్‌ అద్భుతంగా పరిపాలిస్తున్ననేది స్పష్టం అయిందని అని కొడాలి నాని సెటైర్లుప వేస్తున్నారు.

 

బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని.. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని కొడాలి నాని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేలేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో రూ. 5వేల కోట్ల ఇసుక మాఫియా జరిగిందని మంత్రి విమర్శించారు. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ జరగాలని ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తే మండలిలో బాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

 

సీఎం జగన్‌ చేయగలిగిందే చెప్తున్నారని ప్రజలు నమ్ముతున్నారన్నారని అన్నారు. చంద్రబాబు కుట్రల వల్ల సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టను దెబ్బ తీయలేరన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి మతి భ్రమించిందని.. నాలుగేళ్లు బీజేపీతో కలిసి తిరిగి ప్యాకేజీ కోసం హోదాను గాలికి వదిలేశారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: