‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ గా మారిన పరిస్థితులలో ప్రస్తుతం బన్నీ సుకుమార్మూవీ తరువాత బన్నీ డేట్స్ ఇస్తే చాలు అంటూ అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇప్పటి నుండే డేట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అల’ సూపర్ సక్సస్ తో మహేష్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ అతడికి మరొక షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

బయటకు వస్తున్న వార్తల ప్రకారం బన్నీ తన భవిష్యత్ సినిమాలకు సంబంధించి తన పారితోషికాన్ని 40 కోట్ల రేంజ్ కి పెంచడమే కాకుండా అలాంటి స్థాయిలో పారితోషికం ఇవ్వగల నిర్మాతల సినిమాలను మాత్రమే అంగీకరించే ఉద్దేశ్యంలో బన్నీ ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు పారితోషికం 40 కోట్ల రేంజ్ లో ఉన్న పరిస్థితులలో మహేష్ పారితోషికం కంటే తనకు ఎక్కువ కావాలి అని డిమాండ్ చేసే ఆలోచనలలో బన్నీ ఉన్నట్లు టాక్. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ మూవీ సక్సస్ తో యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులలో బన్నీ మ్యానియా విపరీతంగా పెరగడంతో అనేక బ్రాండ్స్ ప్రస్తుతం మహేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తున్న బహుళ జాతి కంపెనీలతో సహా ఇప్పుడు బన్నీ వైపు చూస్తున్నట్లు టాక్. ఇప్పటికే రెండు మూడు బహుళ జాతి కంపెనీలు బన్నీ తో తమ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించమని దీనికి సంబంధించి తాము మహేష్ కు ఇస్తున్న పారితోషికం కంటే ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో బన్నీ మహేష్ ల మధ్య జరిగిన ఒకే ఒక్క పోటీ టాలీవుడ్ టాప్ హీరోల స్థానాలలో అనేక మార్పులు తీసుకు రావడమే కాకుండా ఏకంగా మహేష్ పారితోషిక స్థాయిని దాటిపోయే విధంగా బన్నీని ‘అల’ సక్సస్ సూపర్ హీరోను చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: