‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ గా మారడంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ లకు మీడియాలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనితో వీరితో ఇంటర్వ్యూలు చేయడానికి అనేక ప్రముఖ పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలు ఇచ్చిన బన్నీ త్రివిక్రమ్ లు తమ ఇంటర్వ్యూలు కావాలి అని అడుగుతున్న మీడియా సంస్థల ప్రతినిధులకు కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు సమాచారం. 

సాధారణంగా మీడియా మీట్ కు వచ్చే సీనియర్ జర్నలిస్టులకు సెలెబ్రెటీలు తమను ఇలాంటి ప్రశ్నలు మాత్రమే అడగాలి అన్న కండిషన్స్ పెట్టరు. దీనితో కొన్ని ప్రశ్నలను ఆ సెలెబ్రెటీ లను పరిమిత స్థాయిలో కార్నర్ చేస్తూ సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 

అయితే ఈసారి సీన్ రివర్స్ అయి ఏకంగా అల్లు అర్జున్ మీడియా వర్గాలకు ప్రశ్నా పత్రాలు ఇస్తున్నట్లు టాక్. ‘ఇండస్ట్రీ రికార్డు కొట్టారు కదా ఎలా ఫీలవుతున్నారు?సంక్రాంతి విన్నర్ మీరే కదా? ఎలా ఫీలవుతున్నారు? ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మీదే కదా? ఏమంటారు?బాహుబలి వన్ రికార్డు దాటారు కదా? ఎలా అనిపిస్తోంది?’ అన్న ప్రశ్నలు ఖచ్చితంగా ఉండాలి అన్న కండిషన్స్ బన్నీ పిఆర్ టీమ్ మీడియా వర్గాలకు పెడుతున్నట్లు టాక్. 


ఇలా ప్రశ్నలు అడిగితే ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ అన్న ప్రచారం సినిమా విషయాలను పట్టించుకోని వారికి కూడ తెలియాలి అన్న వ్యూహంలో భాగం అని అంటున్నారు. ఒకవైపు ‘అల’ రికార్డులను భవిష్యత్ లో ఎదో ఒక సినిమా బ్రేక్ చేస్తుంది అంటూ చాల నిరాడంబరంగా చెపుతున్న బన్నీ పరోక్షంగా అల మూవీతో తాను ఇండస్ట్రీ నెంబర్ వన్ అంటూ పదేపదే చేసుకుంటున్న ప్రచారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలను మాత్రమే కాకుండా చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే ‘అల’ కలక్షన్స్ విషయంలో జరుగుతున్న ప్రచారం పై అనుమానాలు ఉన్న నేపధ్యంలో బన్నీ ఇస్తున్న ప్రశ్నా పత్రాలు అర్ధాలు ఏమిటి అంటూ మీడియా వర్గాలు కూడ ఆశ్చర్య పోతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: