వరస పరాజయాలతో అవస్థ పడుతూ హ్యాట్రిక్ ఫెయిల్యూర్ హీరోగా ఇండస్ట్రీలో ముద్ర వేయించుకున్న అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న మూవీకి ఎవరు ఊహించని ఒక టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ ను రేపు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారం వరకు ఈ మూవీకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. బ్యాచలర్ పదాన్ని టైటిల్ గా పెట్టి మోస్ట్ ఎలిజిబుల్ అన్న పదాన్ని చిన్న అక్షరాలుగా ఈ టైటిల్ పైన వేస్తారని టాక్. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రస్తుతం గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు గాంచిన పూజ హెగ్డే నటిస్తోంది. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాలెంటైన్స్ డే కి రాబోతున్న ఈమూవీకి సంబంధించి టైటిల్ తో యూత్ కు బాగా కనెక్ట్ కావడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు అఖిల్ కూడ యూత్ ను టార్గెట్ చేస్తూ బ్యాచలర్ పదాన్ని ఆధారంగా చేసుకుని మరొకసారి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. 

మూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం అయితే నాగార్జున నాగచైతన్య అఖిల్ ను కలిపి ఒక మల్టీ స్టారర్ చేయడమే కాకుండా ఆ మూవీలో తాను కూడా నటించాలని ఇప్పటి నుంచే కథలు వింటున్నాడు. ప్రస్తుతం నిర్మాతగా అల్లు అరవింద్ అదృష్టం పరుగులు తీస్తోంది. కేవలం ఒకే నెల గ్యాప్ లో వచ్చిన ‘ప్రతిరోజు పండగే’ ‘అల వైకుంఠపురములో’ మూవీలు రెండు ఘన విజయాలు సాధించడంతో ఆ అదృష్టం సెంటిమెంట్ అఖిల్ కు కూడ కలిసి వస్తుందని నాగ్ నమ్మకం. మరి నాగార్జున నమ్మకం ఈసారి అయినా గురి తప్ప కూడదు అన్న పట్టుదలతో ఈ మూవీ కూడ సక్సస్ అవ్వకపోతే అఖిల్ పరిస్థితి ప్రశ్నార్ధకం.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: