మెగాస్టార్ చిరంజీవికి సినిమా తప్ప మరొక ప్రపంచమే తెలియదు. సినిమాలోని పాత్రల కోసం తనని ఎలాగైనా మార్చుకోగల శక్తి, సామర్థ్యం, పట్టుదల మెగాస్టార్ చిరంజీవి లో ఉంది. తన ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా డాన్సులు, ఫైట్లు గట్రా చేస్తూ తెలుగు సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. గతంలో పాన్ ఇండియా మూవీగా విడుదలైన సైరా నరసింహారెడ్డి తెలుగులో తప్ప మరేతర భాషల్లో సరిగా ఆడలేదు. దీంతో భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి నిర్మాత రామ్ చరణ్ కు బాగా నష్టం కలిగించింది. అందుకే ఆ నష్టాలను భర్తీ చేయాల్సిన అవసరం చిరంజీవికి ఎంతైనా ఉంది కాబట్టి.. కొరటాల శివతో మరొక సినిమాని తీసేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ చిత్రాన్ని మాత్రం చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించాలని రామ్ చరణ్ కొరటాల శివతో చెప్పారట. ఈ సినిమాలో అన్ని మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉంటే తక్కువ బడ్జెట్ పెట్టినా ఎక్కువ లాభాలు రాబట్టే అవకాశం ఉందని చెర్రీతో పాటు చిరంజీవి కూడా భావిస్తున్నారు. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHIRANJEEVI' target='_blank' title='chiru-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chiru</a> and sharwanand


ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే... చిరంజీవికి వయసు పైబడింది కాబట్టి ఈ ఒక్క సినిమాతో తన నటనకి గుడ్ బాయ్ చెబుతారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. నటనకి వీడ్కోలు చెప్పినా.. తాను మాత్రం ఇప్పట్లో సినీ పరిశ్రమకి దూరం అవ్వాలని అనుకోవడం లేదట. ఇప్పటివరకు నటుడిగా టాలీవుడ్ లో రాణించిన చిరంజీవి... ఇకమీదట నిర్మాతగా యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడని సమాచారం. అయితే ప్రధానంగా నాగశౌర్య, శర్వానంద్, విజయ్ దేవరకొండలతో సినిమాలు తీసేందుకు చిరంజీవి బాగా ఆసక్తి చూపుతున్నారట. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NAGA ASWIN' target='_blank' title='naga-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>naga</a> shourya


ఇంతకుముందు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండని ఎంతగా పొగిడారో అందరికీ తెలుసు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో కూడా విజయ్ దేవరకొండతో గీతా గోవిందం సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాసిందన్న విషయం తెలిసిందే. నిజానికి గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు విజయ్ దేవరకొండ ఇమేజ్ ఆశించిన దానికంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేసి పెట్టింది. అందుకే ఒకవేళ చిరంజీవి తన సొంత బ్యానర్ కింద నిర్మాణ సంస్థను స్థాపిస్తే విజయ్ దేవరకొండతో తొలుత సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. ఆ తరువాత సక్సెస్ ఫుల్ హీరోలైన నాగ శౌర్య, శర్వానంద్ లతో సినిమాలు తీసేందుకు చిరంజీవి ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలుస్తోంది. మరి ఇంతకీ చిరంజీవి ప్రత్యేకంగా ఒక నిర్మాణ సంస్థని స్థాపిస్తారా లేదా రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ద్వారా నిర్మాతగా మారతారా? అనే అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: