గత కొన్ని సంవత్సరాలుగా నటసింహం నందమూరి బాలకృష్ణ వయసు పైబడినా కుర్రాడు వాడిలాగా తయారయ్యి డాన్సులు, ఫైట్లు చేస్తూ ఎన్నో సినిమాల్లో చాలా శ్రమతో నటించాడు కానీ దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్స్ గానే మిగిలిపోయాయి. మరీ గత మూడు సంవత్సరాల బాలకృష్ణ సినీ కెరియర్ ని పరిశీలిస్తే.. అతడు తీసిన మూడు సినిమాలు అత్యంత దారుణంగా ఫ్లాప్ అయ్యి నందమూరి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

 

మొన్నీమధ్య భారీ అంచనాలతో విడుదలైన రూలర్ సినిమా కోసం బాలకృష్ణ బరువు తగ్గినప్పటికీ.. అది మాత్రం సినిమా విజయం అయ్యేందుకు హెల్ప్ చేయలేదు. ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెట్టిందన్న టాక్ కూడా బాగానే వినిపించింది. దీంతో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని ఎలాగైనా బ్లాక్ బాస్టర్ చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు బోయపాటి శ్రీను తో సినిమాకి చేసేందుకు సిద్ధమయ్యాడు.


అయితే ఇటీవల విడుదలైన రూలర్ సినిమా డిజిటల్ రైట్స్ ని పాపులర్ టీవీ ఛానల్ అయిన జెమినీ టీవీ సొంతం చేసుకుంది. సాధారణంగా జెమినీ టీవీ ఛానల్ కొత్త సినిమాలను అవి విడుదలైన నాలుగు లేదా ఐదు నెలల తర్వాత టీవీలో ప్రసారం చేస్తుంది. కానీ రూలర్ సినిమాని మాత్రం కేవలం 49 రోజుల్లోనే విడుదల చేయడానికి సిద్ధమైంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ లలో రూలర్ సినిమా తొందరగా ప్రసారమైతే ఇక జెమిని టీవీ లో చూసేవారు ఎవరూ ఉండరు. దీంతో ఎంతో వ్యయంతో కొనుగోలు చేసిన సినిమాకి నష్టం వాటిల్లుతుంది.

 

అందుకే రూలర్ సినిమాని ఈ ఆదివారం అనగా ఫిబ్రవరి 9న ప్రసారం చేయబోతుంది జెమిని టీవీ. ఇకపోతే వెండితెరపై డిసాస్టర్ గా నిలిచిన రూలర్ చిత్రం బుల్లితెరపై ఎటువంటి పేరును తెచుకుంటుందో చుడాలిక. మరోవైపు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో కూడా నెల రోజుల్లోనే బుల్లితెరపై ప్రసారమయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: