యంగ్ కథానాయకిగా తెలుగు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న రాశి ఖన్నాకి బీభత్సమైన సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె ఊహలు గుసగుసలాడే చిత్రంలో చాలా సాంప్రదాయబద్దంగా కనిపించి తెలుగు ప్రేక్షక అభిమానులందరిని బాగా ఎంటర్టైన్ చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ పాత్రలలో నటిస్తూ... ఎక్స్పోజింగ్ అతిగా చేయకుండా డీసెంట్ అభిమానులను సంపాదించింది. కానీ మొన్నటి వరకు ఆమెకు చాలా గౌరవం ఇచ్చిన అభిమానులే నేడు మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు.


దానికి కారణం రాశి ఖన్నా.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోని బోల్డ్ క్యారెక్టర్ లో నటించడమేనని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ వారాల క్రితం విడుదలవ్వగా.. అందులో రాశి ఖన్నా విజయ్ దేవరకొండతో ఒక సెక్స్ సన్నివేశంలో కనిపించింది. అలాగే లిప్ కిస్లు చేస్తూ తన ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచింది. దీంతో చాలా మంది అభిమానులు రాశి ఖన్నాని బాగా అసహ్యించుకోవడంతో పాటు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరికొందరు మాత్రం ఇటువంటి సన్నివేశాలు చేయవద్దని మర్యాదపూర్వకంగా సలహాలు ఇచ్చారు.


ఇక ఇవన్నీ గత కొంతకాలంగా నిశ్శబ్దంగా భరిస్తున్న రాశి ఖన్నా.. తాజాగా ఈ విషయంపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ... ' నేను పోషించిన యామిని క్యారెక్టర్ చాలా క్లిష్టతరమైనది. ఆ సెక్స్ సీన్ వెనుక ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ ఎమోషన్ ఉంది. అంతేకానీ ఏదో కుర్రకారుని అట్రాక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సన్నివేశం తీయలేదు. ఒక్కసారి సినిమా చూసిన తర్వాత నేనెందుకు ఈ పాత్రలో చేశానో మీకే అర్థమవుతుంది', అని చెప్పుకొచ్చింది. ఇక అధర చుంబనలా గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదని ఆమె చెప్పింది. ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా రాశి ఖన్నా వివరణ బట్టి చూస్తే ట్రైలర్ లో ఉన్న అశ్లీలత కేవలం కథను అనుసరించి మాత్రమే చిత్రీకరించారని ఊహించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: