ఈ మద్య వైవిధ్యభరిత కథాంశాలతో చిన్న చిత్రాలు బాగానే సందడి చేస్తున్నాయి.  భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ ఒక చిన్న చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో టాలీవుడ్ కి చెందు అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం  గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్టుతో ఈ కథ నడవనుంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం పేరు ఓ పిట్టకథ.  పేరు చూస్తుంటేనే చాలా వెరైటీగా ఉన్న ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా ఉండబోతుందని దర్శకుడు చందూ అంటున్నారు.  గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారట.

 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త అప్ డేట్ తెలిపారు.  ఈ చిత్రం నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక టీజర్ ను రిలీజ్ చేయించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకి ఈ టీజర్ ను వదలనున్నారు. వినోదభరితమైన సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుందని దర్శకుడు చెందు చెప్పాడు.  ఈ మద్య చిన్న సినిమాలకు పెద్ద హీరోలు మంచి సహకారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హోదాలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలకు ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి పెద్ద హీరోలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నారు.

 

మొదటి నుంచి చివరివరకూ ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుందని అన్నాడు. కాగా, ఈ మూవీలో శ్వంత్, సంజయ్ , బాలరాజు, నిత్య శెట్టి , బ్రహ్మాజీ ఈ చిత్రంలో ప్రధానమైన పాత్రలను పోషించారు.   ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. చిన్న సినిమాలైన కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: