టాలీవుడ్‌ సూపర్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌ ను ఒక స్థాయికి చేర్చిన స్టార్ హీరోలు. నిజానికి వీరిద్దరి సినిమాల మధ్య గట్టి పోటీ ఉండేది. దానితోపాటు ఈ హీరోలిద్దరి అభిమానులు కూడా అదే స్థాయిలో తిట్టుకునేవారు. చిరంజీవి, బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ హీట్ మరింత ఎక్కువ అయింది అని చెప్పవచ్చు. ఒక కాలంలో చిరంజీవి, బాలకృష్ణకు పడట్లేదని, వారి మధ్య దూరం పెరిగిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ, వాటిలో ఎక్కడా నిజం లేదని వీరిద్దరూ చాలా సార్లు చెప్పారు.

 

 

ఎవరు ఎన్ని చేసినా రాజకీయాల్లో చేసుకున్న విమర్శలు అక్కడి వరకేనని అవి ఎట్టి పరిస్థితులలో సినిమాల్లోకి తీసుకురామని ఈ ఇద్దరు హీరోలూ ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు. మెగాస్టార్ తనకు ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ లో బాలకృష్ణ అని చాలా సార్లు చెప్పారు. ఇంకా చిరంజీవి కూడా బాలకృష్ణ తనకు మంచి స్నేహితుడని ఎన్నోసార్లు అన్నారు. అయితే, వీళ్లిద్దరూ కలిసి మాట్లాడుకునేది మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల అంత సులువు కాదు. అనుకోకుండా కలుసుకుంటే వీరు ఇరువురు మాత్రం కచ్చితంగా ఆప్యాయంగా పలకరించుకుంటారు.

 

 

అయితే ఇప్పుడు కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవల్లిక పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ ఇరివురు కలుసుకున్నారు. వీరు పక్కపక్కన సోఫాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ సమయం  ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోల్లో ఇద్దరూ చాలా సీరియస్‌ గా ఏదో విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్టు ఉంది. వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలీదు కానీ, ఆ ఫోటో మాత్రం అదిరిపోయింది.

 

స్వర్గీయ సినీ దర్శకుడైన కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవల్లిక బుధవారం రాత్రి వివాహం జరిగింది. ఈ వివాహం హైదరాబాద్‌ లో వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో కె.రాఘవేంద్రరావు, మోహన్ బాబు, జీవిత, గోపీచంద్, బెల్లంకొండ శ్రీనివాస్, బి.గోపాల్, ఆలీ, మురళీ మోహన్, గోపీచంద్, జయప్రద,  తదితరులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.

 

 

అయితే ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ ప్రస్తుతం ఎవరి సినిమాలతో వాళ్లు చాలా బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తుండగా, బోయపాటి శ్రీనుతో బాలయ్య ముచ్చటగా మూడోసారి అయన సినిమా చేస్తున్నారు. వీటిలో చిరంజీవి సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, బాలకృష్ణ సినిమా సెట్స్‌ పైకి ఇంకా వెళ్లాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: