ఆమె అందాల తార. ఆమె నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్గుదులను చేసింది. ఆమె ఏ పాత్రను ఎంచుకున్న ఆ పాత్రకి ప్రాణం పోస్తుంది. ఆమె చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరితో నటించేస్తుంది. తన మొదటి సినిమాతో అభిమానుల మనసును మాయం చేసింది. ప్రతి కథలో కొత్త కోణాన్ని చూసుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈ భామ సినీ ఇండస్ట్రీలో గొప్ప పేరున్న ఇంటికి కోడలు ఆమె సమంత అక్కినేని. సమంత కూడా మరో మహానటి.

 

శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘జాను’. తమిళ హిట్‌ చిత్రం ‘96’కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించగా దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఇటీవల విడుదలైన పాటలు యువతను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. అయితే జాను మూవీ ఓ సుందరకావ్యం అని ప్రేక్షకులకు సినిమా చూసి మధురానుభూతులను మననం చేసుకుంటారన్నారు. 

 

‘జాను’ చిత్రంలో సమంత లేకుంటే తాను అంతగా నటించ లేకపోయేవాడినేమోనన్నారు. ఈ చిత్రం ద్వారా తనకెంత పేరొచ్చినా ఆ క్రెడిట్‌ సమంతకే దక్కుతుందన్నారు. చాలామందికి లవ్‌ ఫెయిల్యూర్‌ అన్నది ఉంటుందని, అయితే అందరికీ ఫస్ట్‌ లవ్‌ గుర్తుండిపోతోందన్నారు. చిత్రంలోని డైలాగ్‌ను చెప్పాలని పలువురు కోరగా ‘10 నెలల పాటు మోసిన మీ అమ్మకు నువ్వు సొంతమైతే, ఇన్నాళ్లుగా నిన్ను మోస్తున్న నాక్కుడా నువ్వు సొంతమేనని’ చెప్పి శర్వానంద్‌ అలరించారు. తన కెరీర్‌లో బెస్ట్‌ చిత్రంగా ‘జాను’ నిలుస్తుందన్నారు.

 

సమంత మంచి కథతో మ్యూజిక్ తో మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని అన్నారు. జాను’ చూసే వారంతా హ్యాండ్‌ కర్చీఫ్‌లను పట్టుకుని థియేటర్లకు వెళ్లాలన్నారు. అంతటి లవ్‌ ఈ సినిమాలో ఉందని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని సమంత వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: