భారతీయ సినీ చరిత్రలో ఎన్నో ప్రయోగాత్మయ చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు విశ్వనటుడు కమల్ హాసన్.  పొట్టివాడిగా, ముసలివాడిగా, కురూపిగా ఎలాంటి పాత్రలకైనా ఆయన తర్వాత అన్న పరిస్థితి ఉండేది. అలాంటి కమల్ హాసన్ కేవలం నటుడుగానే కాకుండా డ్యాన్స్, మ్యూజిక్, డైరెక్షన్, నిర్మాణ రంగంలో కూడా ప్రత్యేకత చాటుకున్నారు.  ప్రస్తుతం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా ఆయన తన సత్తా చాటుతున్నారు.  గత కొంత కాలంగా కమల్ హాసన్ నటిస్తున్న చిత్రాలకు పెద్దగా ఆదరణ లభించడం లేదు.. అందుకే ఆయన చూపు రాజకీయాల వైపు మళ్లిందని అంటున్నారు నెటిజన్లు.  ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్, కాజల్ జంటగా ‘ఇండియన్ 2’ మూవీలో నటిస్తున్నారు. 

 

 భారతీయుడు 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.  అప్పట్లో ఈ మూవీ పెద్ద సెన్సేషన్ సృష్టించింది.  లంచగొండితనంపై ఓ మాజీ స్వాతంత్ర సమరయోధుడు ఎలా పోరాటం చేశాడు..చివరికి తప్పు చేసిన తన కొడుకును సైతం ఎలా చంపాడు అన్నదే సినిమా కాన్సెప్ట్.    కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు.  చాలా కాలం తర్వాత ఈ మూవీ సీక్వెల్ తీస్తున్నారు.  ప్రస్తుతం ఇండియన్ 2 రెగ్యూలర్ షూటింగ్ బిజీలో ఉన్నారు.  అయితే ఈసారి రాజకీయ నేపథ్యంలో ఉండబోతున్నట్లు సమాచారం.

 

ఇదిలా ఉంటే కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయ, సినిమా నేపథ్యంలోనే కాకుండా మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారట. డిజిట‌ల్ రంగంలోకి క‌మ‌ల్ హాస‌న్ అడుగుపెడుతున్నారు. బ‌నిజ‌య్ ఏషియా, ట‌ర్‌మెరిక్ నెట్‌వ‌ర్క్ పై.లి సంస్థ‌ల‌తో క‌మ‌ల్ చేతులు క‌లిపారు. ఇప్ప‌టికే కొన్ని కాన్సెప్ట్‌ల‌ను సిద్ధం చేశామ‌ని, కొత్త టాలెంట్‌ను, కొత్త కాన్సెప్ట్ అందించ‌బోతున్నామ‌ని మేక‌ర్స్  వెల్లడించారు. మరి ఈ కొత్త రంగంలో కమల్ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: